వైరల్ అవుతున్న ఈషారెబ్బ గ్లామరస్ ఫోటోషూట్స్..!

భారతదేశ చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ కు సంబంధించి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ హీరోయిన్ గా అవకాశం వచ్చిన ఒకటి లేదా రెండు సినిమాలకే వారిని పరిమితం చేస్తున్నారు సినీ దర్శక నిర్మాతలు. దీనికి కారణం తెలుగు అమ్మాయిలు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు అనే ఉద్దేశంతో ఉత్తర భారతదేశం నుండి హీరోయిన్ తీసుకువచ్చి నటింప చేస్తున్నారు. అయితే పరిస్థితి ప్రస్తుతం కాస్త మారిందనే చెప్పవచు. ప్రస్తుతం తెలుగు అమ్మాయిలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయడానికైనా సిద్ధమైపోతున్నారు. దీనికి కారణం ఒక్కసారి సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా స్కిన్ షో అలాగే ఇతర అంశాలకు సంబంధించిన వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తోంది.

ఇదే బాటలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ అంతకు ముందు ఆ తర్వాత ‘ అనే సినిమాతో అరంగ్రేటం చేసిన తెలుగు బ్యూటీ ఈసారి కూడా చేరిపోతోంది. ఈవిడ తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్న కానీ ఆమెకు సంబంధించి కెరీర్ ను నిలబెట్టే కొన్ని పాత్రలు రాలేదు. సినీ ప్రేమికులను మయమరిపించే విధంగా అందం చందం ఉన్నప్పటికీ ఈషా రెబ్బ హీరోయిన్ గా సరైన బ్రేక్ లేకపోవడంతో వెనుకబడిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం తనకు వచ్చిన అవకాశాలను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా దూసుకెళుతోంది. మొన్నటి వరకూ గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకున్న ఈవిడ ఇటీవలే సినిమాల కోసం అందాల ఆరబోతకు సిద్ధం అన్నట్లుగా కనపడుతోంది. దీనికి కారణం తాజాగా ఈ భామ అదిరిపోయే గ్లామర్ షో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో ఆవిడ హాట్ డోస్ పెంచిందని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Share post:

Popular