వైరల్ అవుతున్న అన‌సూయ గ్లామర్ పిక్స్..!

బుల్లి తెర పై గ్లామరస్ క్వీన్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అందాల భామ యాంకర్ అనసూయ. త‌న అందం, అభినయంతో అంది వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది అన‌సూయ‌. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటో షూట్స్‌ పంచుకుంటూ నెటిజ‌న్స్‌ని మెప్పిస్తూ ఉండే అన‌సూయ శ‌నివారం రోజున రెడ్ స్క‌ర్ట్‌లో అదిరిపోయింది.

అలానే తాజాగా బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌తో ఫొటోల‌కు పోజులు ఇస్తూ, ఆ పిక్స్ ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసింది అనసూయ. బ్లాక్ డ్రెస్‌లో అంత అందంగా ఉన్న అన‌సూయ‌ను చూసిన నెటిజన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. అనసూయ ఇటు బుల్లితెర‌ పై షోస్ చేస్తూనే, అటు వెండితెర‌ పై మంచి వైవిధ్యమయిన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది అన‌సూయ‌. ఇటీవలే చావు క‌బ‌రు చ‌ల్ల‌గా అనే మూవీలో ఒక స్పెష‌ల్ సాంగ్‌లో అలరించింది అన‌సూయ.