పవన్ పై మలయాళీ కుట్టి ట్వీట్..!

May 2, 2021 at 1:09 pm

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో చూసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. సినిమాపై, అలాగే చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో నటుడు ప్రకాష్‌రాజ్‌ను ‘సార్‌’ అని సంభోదించిన అనుపమ హీరో పవన్ కల్యాణ్‌‌ని మాత్రం ట్విట్టర్ ఐడీకే పరిమితం చేసింది. దీంతో రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇది గమనించిన అనుపమ తను రియలైజ్ అయినట్లుగా చెబుతూ.. ఫ్యాన్స్‌కి సారీ చెప్పి పవన్ కల్యాణ్‌గారు, ఎంతో గౌరవం మరియు ప్రేమతో అని పేర్కొంటూ మరో ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

వాస్తవానికి ఈ చిత్రంలోని నివేదా థామస్ పాత్రలో ముందు అనుపమనే అనుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ‘వకీల్‌సాబ్’ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సంచలనాలను క్రియేట్ చేస్తుండటం విశేషం. అనుపమ ప్రస్తుతం దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ‘హుషారు’ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘రౌడీ బాయ్స్‌’ పేరు పెట్టింది చిత్రబృందం.

పవన్ పై మలయాళీ కుట్టి ట్వీట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts