అల్లు శిరీష్ మేకోవర్ అదుర్స్…పిక్స్ వైరల్..!

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిస్ స్టార్ బన్నీ పాపులారిటీ అంతా ఇంతా కాదు. అల్లుఅర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు కూడా ఆ తరహా క్రేజ్ ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లుశిరీష్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతుంటాడు.

ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ రొమాంటిక్-కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. చాలాకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న అల్లు శిరీష్ ఇటీవలే “విలాయతి శరబ్” అనే హిందీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో రచ్చ చేసాడు. ఇక మళ్ళీ తాను సినిమాలకు సిద్ధం అంటూ ఇటీవలే ప్రకటించాడు.