నాగార్జున సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీ రోల్‌?!

May 21, 2021 at 11:20 am

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒక‌టి. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ మూవీలో నాగార్జునతో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్, స‌మంత‌ కూడా న‌టించ‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల‌గా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ క‌ళ్యాణ్ ఓ కీ రోల్ పోషించ‌బోతున్నార‌ట‌. ఈ మూవీలోని కీలకమైన పావు గంట గెస్ట్‌ రోల్‌ ను పవన్ తో చేయించడం వల్ల సినిమాకు మరింత ఆకర్షణ వస్తుందని నాగ్ మ‌రియు కళ్యాణ్ కృష్ణ భావించార‌ట‌. ఇందులో భాగంగానే ప‌వ‌న్‌తో సంప్ర‌దింపులు షురూ చేశార‌ని.. ఆయ‌న నుంచి పాజిటివ్ రెస్పాన్సే వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో చూడాలి.

నాగార్జున సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీ రోల్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts