ఆ టాలీవుడ్ హీరోకు అభిమాని బెదిరింపులు..ఏం జ‌రిగిందంటే?

ఓ అభిమాని సూసైడ్ చేసుకుంటానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా టాలీవుడ్ హీరోను బెదిరించారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు..విశ్వక్ సేన్‌. `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన విశ్వ‌క్‌.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ త‌ర్వాత ఫ‌ల‌క్‌నుమాదాస్ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం కూడా తానే వ‌హించి మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విశ్వ‌క్‌.. తాజాగా అభిమానుల‌తో ముచ్చ‌టించారు.

ఈ క్ర‌మంలోనే అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన విశ్వ‌క్‌.. కొట్టినికి మాత్రం ఆన్స‌ర్ చేయ‌లేదు. దీంతో ఓ నెటిజ‌న్ అన్నా నువ్వు రిప్లై ఇవ్వ‌క‌పోతే సూసైడ్ చేస్కుంటా, నీ మీద ఒట్టు అని కామెంట్ చే‌శాడు. దీంతో ఖంగు తిన్న విశ్వ‌క్ ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని షాకయ్యాడు. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌తి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ వెళ్లాడు.