చీర‌క‌ట్టులో అదిరిపోయిన‌ సాయిప‌ల్ల‌వి..ఫొటోలు వైర‌ల్‌!

సాయి ప‌ల్ల‌వి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రంలేని పేరు ఇది. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన `ఫిదా` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సాయి ప‌ల్ల‌వి.. మంచి నటిగా, పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది.

 చీరకట్టులో సాయి పల్లవి (Instagram/Photo)

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో రానా స‌ర‌స‌న‌ విరాటపర్వం, నాగచైతన్య స‌ర‌స‌న‌ లవ్‌స్టోరి, నాని స‌ర‌స‌న‌ శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో నటిస్తుంది. అయితే వీటిలో ల‌వ్ స్టోరి చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా.. విడుద‌లకు సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో.. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది.

 చీరకట్టులో సాయి పల్లవి (Instagram/Photo)

ఈ క్ర‌మంలోనే తాజాగా సాయి ప‌ల్ల‌వి కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ.. ల‌వ్‌స్టోరీ ప్ర‌మోష‌న్స్ కోస‌మ‌ని తెలిపింది. ఈ ఫొటోల్లో స్కై క‌ల‌ర్ శారీ ధ‌రించిన సాయి ప‌ల్ల‌వి.. త‌న క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

 చీరకట్టులో సాయి పల్లవి (Instagram/Photo)

 చీరకట్టులో సాయి పల్లవి (Instagram/Photo)

 చీరకట్టులో సాయి పల్లవి (Instagram/Photo)