అఖండ సినిమాకి బాల‌య్య రెయ్యునరేష‌న్ ఏంటంటే..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, సీనియర్ నటులు ఒక్కో చిత్రానికి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాకు మాత్రం కేవలం 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు బాలయ్య ఎక్కువ మొత్తం డిమాండ్ చేసినా దర్శకుడు బోయపాటి నచ్చజెప్పడంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారని టాక్.

చిత్ర నిర్మాత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ తగ్గిందని వినిపిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అఖండ చిత్రం తరువాత బాలకృష్ణ అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటించబోతున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.