రామ్ చ‌ర‌ణ్ అంటేనే మూతిముడుచుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు ఎంతో క్రేజ్ ఉందో.. ఎంద‌రు అభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం రామ్ చ‌ర‌ణ్ అంటేనే మూతి ముడుచుకుంటుంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. అనుపమ పరమేశ్వరన్‌. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అయితే ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో కాస్త సైలెంట్ అయిన అనుప‌మ‌.. ప్ర‌స్తుతం `రౌడి బాయ్స్` సినిమాలో న‌టిస్తోంది. హుషారు దర్శకుడు హర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ మూవీతో ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినమా ప్రమోషన్‌లో భాగంగా ఈమె అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు చ‌క‌చ‌కా సమాధానాలు చెప్పింది.

అయితే ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ `మీరు, రామ్ చరణ్ కలసి నటించే సినిమా మేం ఎక్స్ పెక్ట్ చేయొచ్చా?` అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు అనుప‌మ ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక మూతి ముడుచుకున్నట్టు వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. అయితే అనుపమ వెరైటీ రియాక్షన్ కి కారణం… `రంగస్థలం`. ఈ చిత్రంలో మొద‌ట అనుప‌మ‌నే సంప్ర‌దించార‌ట‌. కానీ, చివ‌ర్లో స‌మంత‌ను ఎంచుకున్నార‌ట‌. ఒకవేళ ఈ చిత్రంలో అనుప‌మ న‌టించి ఉంటే.. ఆమె కెరీర్‌నే ట‌ర్న్ అయ్యేంది.