న్యూడ్‌ ఫొటో పెట్ట‌మ‌న్న నెటిజ‌న్‌..ప్రియ‌మ‌ణి దిమ్మ‌తిరిగే రిప్లై!

ప్రియ‌మ‌ణి .. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ప్రియ‌మ‌ణి.. `పెళ్ళైనకొత్తలో..` సినిమాతో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ప్రియ‌మ‌ణికి వ‌రుస అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి.

ఈ క్ర‌మంలోనే అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించింది. అయితే ముస్త‌ఫా రాజ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత‌.. సినిమాల‌కు దూరంగా ఉంది ఈ బ్యూటీ. కానీ, మ‌ళ్లీ ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టి.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియ‌మ‌ణి బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఓ నెటిజ‌న్ మీ న్యూడ్ ఫొటో షేర్ చేయండి కామెంట్ పెట్టాడు. అయితే స‌ద‌రు నెటిజ‌న్‌కు ప్రియ‌మ‌ణి దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది. ముందు మీ సోద‌రిది గానీ మీ త‌ల్లిది గానీ అలాంటి ఫొటో పెట్టండి. అప్పుడు నేను పెడ‌తాను అని ప్రియ‌మ‌ణి స‌మాధానం ఇచ్చారు. దాంతో స‌ద‌రు నెటిజ‌న్లు ప్రియ‌మ‌ణికి సారి చెప్పి సైలెంట్ అయ్యాడు.‌