బాలయ్య – పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరికొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. ఈ యేడాది సంక్రాంతికి తన కెరీర్లోనే ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మరోసారి పైసా వసూల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.
శాతకర్ణి తర్వాత బాలయ్య-పూరీ ఇద్దరూ కలిసి జెట్ స్పీడ్‌తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవల పూరీ ట్రాక్ అస్సలు బాగోలేదు. పూరీ డైరెక్ట్ చేసిన చివరి నాలుగు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. దీంతో పూరీ పైసా వసూల్‌ను ఎలా తెరకెక్కించాడా ? అన్న టెన్షన్ బాలయ్య అభిమానులతో పాటు అందరిలోను ఉంది.
ఇక పైసా వసూల్ ప్రి రిలీజ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో బాలయ్యను పూరి తనదైన స్టైల్లో చాలా కొత్తగా ప్రజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక టీజర్, ట్రైలర్లతో పాటు ఇండస్ట్రీలో వినపడుతోన్న ఇన్నర్ టాక్ ప్రకారం పూరీ పైసా వసూల్‌ను పోకిరి స్టైల్లోనే తీశాడని అంటున్నారు. బాలయ్య సినిమాలో సరికొత్త జోష్‌లో ఉంటాడని.. స్టైల్, ఫైట్స్, సాంగ్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్ అదిరిపోతాయంటున్నారు.
ఇక ఫస్టాఫ్ జెట్ స్పీడ్‌తో ఉంటే ఇంటర్వెల్ బాంగ్ కూడా అదిరిందని టాక్ వినబడుతుంది. సెకండ్ హాఫ్‌లో స్టోరీ కోసం కాస్త స్పీడ్ తగ్గినా.. ట్విస్ట్స్, యాక్షన్ పార్ట్, ఆలీ కామెడీ, బాలయ్య పాడిన పెగ్ సాంగ్, ఎన్టీఆర్ రీమిక్స్ సాంగ్ ఎంటర్టైన్ చేస్తాయట. ఇక రన్ టైం కూడా 2.25 గంటలే ఉండడంతో సినిమా ఎక్కడా బోర్ లేకుండా ముందుకు సాగుతుందట. ఓవరాల్‌గా సినిమా ఆహా ఓహా అనేలా కాకున్నా పక్కా పైసా వసూల్ సినిమా అంటున్నారు. మరి బాలయ్య ఎంత వరకు పైసా వసూల్ చేస్తాడో ? చూద్దాం.
తెలుగు జర్నలిస్ట్ లో రేపు ఉదయం 6 గంటలకే “పైసా వసూల్’ రివ్యూ సిద్ధంగా ఉండండి…