బోయ‌పాటి స‌త్తా చూపిన ‘ జ‌య జాన‌కి నాయ‌క ‘ బిజినెస్

మాస్ సినిమాల‌తో వ‌రుస‌గా హిట్లు మీద హిట్లు కొడుతోన్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను లేటెస్ట్ మూవీ జ‌య జాన‌కీ నాయ‌క‌. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా భారీ కాస్టింగ్‌తో తెర‌కెక్కింది. ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గ తెర‌కెక్కిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్  సినిమాకు హైలెట్ కానున్నాయి.

ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శాటిలైట్ బిజినెస్‌లో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బెల్లంకొండ శ్రీను రెండు సినిమాలు అల్లుడు శీను, స్పీడున్నోడు అంత హిట్ కాక‌పోయినా బోయపాటి ఇమేజ్ కారణం సినిమా బిజినెస్ రూ. 40 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. కేవలం శాటిలైట్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి.

తెలుగు వెర్ష‌న్‌ను రూ. 5 కోట్ల‌కు స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకోగా, హిందీ డబ్బింగ్ రైట్స్ సోనీ నెట్ వర్క్ రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. బోయపాటి గత చిత్రం సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్ష‌న్ యూ ట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయ‌డంతో ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్ష‌న్‌కు ఇంత రేటు పెట్టేందుకు సోని ముందుకు వ‌చ్చింది.