బిగ్ బాస్ షోలో మెద‌టి ఎలిమినేట‌ర్ ఎవ‌రు..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షో భారీ అంచ‌నాల మ‌ధ్య మొద‌లై మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది. బిగ్ బాస్ షో అంటేనే స‌హ‌జంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ మ‌ధ్య అస్స‌లు గిట్ట‌దు. వాళ్ల‌కు ఇచ్చే టాస్క్‌ల‌తోనే వాళ్ల మ‌ధ్య అస‌లు వార్ స్టార్ట్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే తెలుగు బిగ్ బాస్ షోలో కూడా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని ప‌రిస్థితులు క‌న‌ప‌డుతున్నాయి.

సీక్రెట్‌గా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని పరిస్థితులు ఏర్ప‌డ్డాయి. వారు ఎంత సీక్రెట్‌గా ప‌క్క‌న వాళ్ల మీద చాడీలు చెప్పుకుంటున్నా వాళ్ల‌కు తెలియ‌కుండానే కెమేరా క‌న్ను క‌నిపెడుతుంద‌న్న విష‌యాన్ని వారు మ‌ర్చిపోతున్నారు. ఇక కుటుంబ స‌భ్యుల్లా మెల‌గాల్సిన వారి మ‌ధ్య గొడ‌వ‌లు స్టార్ట్ అవ్వ‌డంతో ఎవ‌రో ఒక‌రికి ఫ‌స్ట్ వీక్ ఎండింగ్‌లో ఎలిమినేష‌న్ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల‌లో వారానికి ఒక‌రు చొప్పున ఎలిమినేష‌న్ అవుతూ ఉంటారు. ఇక ప్ర‌స్తుతం షోలో ఉన్న వారిలో ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ విష‌యంలో చాలా మంది హౌజ్ మెట్స్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక క్యారెక్ట‌ర్ జ్యోతి విష‌యంలోను చాలా మంది నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. జ్యోతికి అంద‌రికంటే ఎక్కువుగా ఏకంగా 8 నెగిటివ్ ఓట్లు ప‌డ్డాయి.

అయితే ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నంత మాత్రాన‌, ఎక్కువ నెగిటివ్ ఓట్లు ప‌డినంత మాత్రాన వాళ్ల‌ను ఎలిమినేట్ చేస్తార‌న్న రూల్ లేదు. అది బిగ్ బాస్ నిర్ణ‌యం మేర‌కే జ‌రుగుతుంది. మ‌రి ఈ రెండు రోజుల్లో బిగ్ బాస్ హౌజ్‌లో ఇంకెన్ని ట్విస్టులు జ‌రుగుతాయో ? ఫ‌స్ట్ వీక్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో ? వెయిట్ అండ్ సీ..!