ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌రో క్రేజీ హీరో

ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినీ అభిమానులంద‌రిలోను ఓ రేంజ్‌లో క్యూరియాసిటీ పెంచేస్తోన్న సినిమా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా. వీరి కాంబినేష‌న్‌లో సినిమా కోసం తెలుగు సినిమా అభిమానులు దాదాపుగా ప‌దేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వీరి కాంబోలో సినిమా సెట్ కావ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులే లేవు.

క్లాస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, మాస్ హీరో ఎన్టీఆర్‌ను ఎలా డీల్ చేస్తాడ‌న్న‌ది కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో మ‌రో క్రేజీ యంగ్ హీరో కూడా న‌టిస్తున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్‌కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత రాధాకృష్ణ ఇదే సినిమా కోసం నారా రోహిత్‌కు సైతం అడ్వాన్స్ ఇచ్చాడ‌ట‌.

రాజ‌కీయంగా సంచ‌ల‌న‌మేనా..!

ప్ర‌స్తుతం రాజ‌కీయంగా అటు ఎన్టీఆర్‌కు, ఇటు చంద్ర‌బాబు, బాల‌య్య‌తో పెద్ద‌గా స‌ఖ్య‌త లేదు. మ‌రి ఈ టైంలో నారా+నంద‌మూరి కాంబోలో సినిమా అంటే సినిమా వ‌ర్గాల్లోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోను పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. చంద్రబాబు, టీడీపీ పాలిటిక్స్‌తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కూడా పెద్ద మనసుతో నారా వారి హీరోతో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడట.

నిజానికి ఎన్టీఆర్ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత, ఎన్టీఆర్ ఒఫ్పుకున్న తర్వాతే నారా రోహిత్‌ని అప్రోచ్ అయ్యాడట త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్ సినిమాలో కీల‌క రోల్ అన‌గానే రోహిత్ సైతం వెంట‌నే ఒప్పుకున్నాడ‌ట‌. ఏదేమైనా రాజ‌కీయంగా భిన్న ధృవాలుగా ఉన్న ఈ రెండు కుటుంబాల హీరోల సినిమా టాలీవుడ్‌లో పెద్ద సెన్షేష‌న‌ల్‌గానే మారింది. మ‌రి త్రివిక్ర‌మ్ ఈ ఇద్ద‌రు హీరోల క్యారెక్ట‌ర్‌ను ఎలా ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కిస్తాడో ? చూడాలి.