మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని ప్రతి దర్శకుడూ కల కంటుంటాడు. 7-8 ఏళ్ల పాటు రాజకీయాల్లో బిజీ అయిన చిరు ఈ యేడాది సంక్రాంతికి తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిరు ఏడెనిమిదేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్నా ఖైదీ నెంబర్ 150తో మాత్రం సత్తా చాటాడు. చిరు రీ ఎంట్రీ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు చాలా మంది దర్శకులు చిరుతో సినిమా చేసేందుకు ఆసక్తితో ఉన్నారు.
ఈ క్రమంలోనే చిరు సైతం కొంతమంది దర్శకులతో సినిమా చేసేందుకు ఆసక్తితోను ఉన్నారు. మొత్తంగా చిరు 151 సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నా ఆ తర్వాత చిరుతో సినిమా చేసేందుకు కాచుకుని కూస్తోన్న దర్శకుల లిస్ట్ చాంతాడంత ఉంది. ఈ లిస్టులో బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, మరోసారి వినాయక్ వెయిట్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ లిస్టులోకే వచ్చి చేరాడు హరీశ్ శంకర్. తాజాగా బన్నీతో దువ్వాడ జగన్నాథమ్ సినిమాను తెరకెక్కించిన హరీశ్ చిరుతో సినిమా చేసేందుకు తాను కథ కూడా రెడీ చేసుకున్నానని, ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని, చిరు ఓకే అంటే వెంటనే కథ చెపుతానని అంటున్నాడు. మరి డీజే స్టోరీ పాతగా ఉన్నా కమర్షియల్‌గా ఓకే అన్న టాక్ వస్తోంది. హరీశ్‌కు చిరు ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.