అగ్ర హీరోలకే తన సంపాదనతో సవాలు విసురుతున్న నాని

నేచురల్  స్టార్ నాని బిరుదుకు తగ్గట్టే చేసే ప్రతి సినిమాలో తన ఈస్ ఆఫ్ యాక్షన్తో నిర్మాతలకు కాసుల కనక వర్షం దర్శకులకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిన నాని ప్రస్తానం అంచలంచలుగా పెరిగి కోట్లు కొల్లగొట్టే బడా హీరో గా సినీ ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం 2016 హాట్రిక్ హిట్టులు కొట్టిన నాని ఈ సంవత్సరం 2017 ‘ నేను లోకల్’ సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ వస్సూళ్లలో మళ్ళీ తన సత్తా చాటాడు. ఇన్ని హిట్స్ వచ్చాక ఏ హీరో అయిన పారితోషికం పెంచకొండ ఉంటాడా మరి, ఇప్పుడు నాని అదే పని చేసాడు.

నేను లోకల్ సినిమా వరకు నాని పారితోషికం 3 కోట్లు, ఇక నుంచి 5 కోట్లు చేసేసాడట. వాస్తవం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితల్లో నానిని చూసి థియేటర్ కి  వెళ్లే వారు ఉన్నారు నాని ఇమేజ్‌, మార్కెట్‌ దృష్ట్యా ఈ రేంజ్‌ రెమ్యునరేషన్‌ సమంజసమే. ఈ లెక్కన ఈ ఏడాది నాని సంపాదన 15 కోట్ల ఎందుకు అంటున్నానంటే ఈ సంవత్సరం ఇప్పటికే నాని 3 సినిమాలు ఓకే చేసాడు. ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘నిన్ను కోరి’ అనే సినిమాలో చేస్తున్నాడు ఆ తర్వాత దిల్‌ రాజు సినిమా, అది పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు. ఈ మూడు సినిమాలు ఈ సంవత్సరమే తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’ నిర్మాతల బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడట నాని దానికోసం భారీగా తీసొకొబోతున్నాడట. ఇలా చూస్తే నాని ఆదాయం 15  కోట్లు పైమాటే.