సినిమా ఫలితం మరోలా … కాట‌మ‌రాయుడు షాక్

పవర్‌స్టార్‌ పవన్ క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమా ప‌వ‌న్ అభిమానుల‌ను సంతృప్తి ప‌ర‌చినా స‌గ‌టు తెలుగు సినిమా అభిమానిన‌ని మాత్రం అస్స‌లు మెప్పించ‌లేక‌పోయింది. వ‌సూళ్లు కూడా బాగా డ్రాప్ అయ్యాయి. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ గురించి షాకింగ్ వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

కాట‌మ‌రాయుడు బ‌డ్జెట్ టోట‌ల్ రూ.30 కోట్ల‌కు లోపే అని తెలుస్తోంది. చాలా చీఫ్ బ‌డ్జెట్లోనే కాట‌మ‌రాయుడు సినిమాను లాగేశార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే సెకండాఫ్ షూటింగ్‌ను కేవ‌లం 20 రోజుల్లోనే తీసేశార‌ట‌. సెకండాఫ్ విష‌యంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టైతే సినిమా ఫలితం మరోలా ఉండేదని అందరూ అనుకుంటున్నారు.

కేవ‌లం 20 రోజుల్లో చుట్టేయ‌డంతోనే  సెకాండాఫ్‌లో క్వాలిటీ మిస్‌ అయిందని వార్తలు వినబడుతున్నాయి. అలాగే ప‌వ‌న్ గ‌త సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌ను సైతం అనుకున్న టైంకే తీసుకు వ‌చ్చేందుకు రెండు యూనిట్లు పెట్టి లాగేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాను అనుకున్న టైంకు తీసుకురావ‌డం కంటే మంచి క్వాలిటీ సినిమాను, హిట్ సినిమాను ప‌వ‌న్ ఎప్పుడు ఇస్తాడో అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఊసూరుమంటున్నారు.