యువరత్న నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అంతా యూరప్ కూడా వెళ్లనుంది. ఇక ఈ టైటిల్ విషయంలో దర్శకుడు పూరి, హీరో బాలయ్య ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగా ఉంటాయి. టైటిల్ చూడగానే సినిమా చూడాలన్నంత ఎట్రాక్షన్ ఉంటుంది. ఈ క్రమంలోనే బాలయ్యతో తెరకెక్కిస్తోన్న తన తాజా చిత్రానికి ” టపోరి ” అనే టైటిల్ సూచించాడట. బాలయ్యకు సైతం ఈ టైటిల్ బాగా నచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఫైనల్‌గా ఇదే టైటిల్ ఫిక్స్ చేయాలా ? వద్దా ? అన్న విషయంలో ఇంకా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది.
ఇక ” టపోరి ” టైటిల్ చిరు బ్లాక్‌బస్టర్ మూవీ గ్యాంగ్‌లీడర్ సినిమాలో పాటలో ఉంది. గ్యాంగ్ లీడర్లో టపుటపు టపోరీ అనే సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. దీంతో ఇప్పుడు ” టపోరి ” అంటే ఆ పాట మరోసారి తెలుగు ప్రేక్షకు మదిలో రిమైండ్ అవుతుంది. అయితే ఈ ” టపోరి ” టైటిల్ బాలయ్యకు ఎంత వరకు యాప్ట్ అవుతుందా ? అని నందమూరి అభిమానులు కూడా కాస్త సందిగ్ధంలో ఉన్నారు. మరి ఫైనల్‌గా పూరి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తాడో చూడాలి.