పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకను పూణే లో ఘనంగా సెలెబ్రేట్ చేసారు. ఈ వేడుకను పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ దగ్గరుండి జరిపించారు. 2010 మార్చి 23న పుట్టిన ఆద్య గురువారంనాడు ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుక విశేషాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది రేణుదేశాయ్.
పిల్లల పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లలకోసం వెచ్చించటమే వారికిచ్చే పెద్ద గిఫ్ట్ అని తెలియ చేసింది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఆద్యతో కేక్ కట్ చేయించి ఆద్య స్నేహితులతో కలసి సరదాగా గడిపిన ఫొటోస్ ని కూడా షేర్ చేసింది రేణుదేశాయ్.
ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే భార్య భర్తల మధ్య అభిప్రాయ భేధాలుండి విడిపోయినప్పటికీ ఆ ప్రభావమేది పిల్లల సంతోషాలను దూరంచేయకూడదనే పవన్ కళ్యాణ్ ఆలోచన చూస్తుంటేనే పవన్ గొప్పతనం తెలియచేస్తుంది.