ప‌వ‌న్ ” కాట‌మ‌రాయుడు ” క‌థ ఇదే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – శృతీహాస‌న్ జంట‌గా తెర‌కెక్కుతోన్న కాట‌మ‌రాయుడు సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు డాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా వ‌చ్చే ఉగాది కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ లైన్ ఇండ‌స్ట్రీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షిస్తూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు ? తను ప్రేమించిన యువతి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు? అనే యాంగిల్‌లో ఈ సినిమా స్టోరీ ఉంటుంద‌ట‌. ప‌వ‌న్ ఈ సినిమాలో మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న ఓ ఫ్యాక్ష‌నిస్టు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

ప‌వ‌న్‌కు న‌లుగురు త‌మ్ముళ్లుగా కమల్ కామరాజు – విజయ్ దేవరకొండ – శివబాలాజీ – అజయ్ న‌టిస్తున్నారు. ‘కీచక’ ఫేమ్ యామిని భాస్కర్.. మరో కొత్తమ్మాయి మానస హిమవర్ష.. హీరో తమ్ముళ్లను ప్రేమించే అమ్మాయిలుగా కనిపించబోతున్నారు.

కాట‌మ‌రాయుడు గ‌తంలో జ‌గ‌ప‌తిబాబు హీరోగా వ‌చ్చిన పెద్ద‌రికం ఛాయ‌ల‌ను పోలీ ఉంటుంద‌ని తెలుస్తోంది. హీరోకు ఆడ‌వాళ్లంటే ప‌డ‌దు. మ‌నోడు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటాడు. హీరోల త‌మ్ముళ్లు మాత్రం ప్రేమ‌లో ప‌డిపోతారు. చివ‌ర‌కు అన్న‌య్య త‌మ ప్రేమ‌ను అంగీక‌రించేందుకు అన్న‌నే ఓ అమ్మాయి ప్రేమ‌లో దించుతారు. ఈ స్టోరీ మొత్తం రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంద‌ట‌.

కోలీవుడ్‌లో అజిత్ – శివ కాంబినేష‌న్లో వ‌చ్చిన వీర‌మ్ సినిమానే కాస్త అటూ ఇటూగా మార్చి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన డిజిట‌ల్ పోస్ట‌ర్‌కు సైతం అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.