ఖైదీ-శాతకర్ణి మధ్యలో శతమానంకు షాకింగ్ కలెక్షన్స్

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఇద్ద‌రు అగ్ర‌హీరోలు న‌టించిన రెండు భారీ సినిమాల మ‌ధ్య రిలీజ్ అయిన శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి సినిమా రెండు పెద్ద సినిమాల పోటీలో కూడా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌డుతోంది. శ‌త‌మానం డీసెంట్ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది.

శ‌త‌మానం భ‌వ‌తికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మొదటి ఐదురోజుల డిస్ట్రిబ్యూట‌ర్స్ షేర్ రూ.11.90 కోట్లుగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా హాప్ మిలియ‌న్ మార్క్ దాటేసింది. ఓవ‌రాల్‌గా తొలి 5 రోజుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా షేర్ రూ.14 కోట్లుగా ఉంది.

ఏరియాల వారీగా శతమానంభవతి మొదటి ఐదు రోజుల షేర్ :

నైజాం: 3.99 కోట్లు

సీడెడ్ : 1.36  కోట్లు

నెల్లూరు: 27.5 ల‌క్ష‌లు

గుంటురు : 86.75 ల‌క్ష‌లు

కృష్ణా : 73.8 ల‌క్ష‌లు

వెస్ట్ గోదావరి -రూ. 1.04  కోట్లు

ఈస్ట్ గోదావరి -రూ. 1.48 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.2.15  కోట్లు

—————————————-

ఏపీ+తెలంగాణ = 11.90 కోట్లు

————————————–

ఓవ‌ర్సీస్‌లో 5.50 లక్షల డాలర్లు సాధించి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం శతమానంభవతి షేర్ రూ. 14 కోట్లుగా ఉంది. లాంగ్‌ర‌న్‌లో శ‌త‌మానం భ‌వ‌తి శ‌ర్వానంద్ కేరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టే చిత్ర‌మ‌వుతుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఇక ఓవ‌ర్సీస్‌లో సైతం మిలియ‌న్ మార్క్‌ను ట‌చ్ చేసే సూచ‌న‌లు ఉన్నాయి.