రాంచ‌ర‌ణ్‌కు షాక్ ఇచ్చిన నిఖిల్‌

మెగా ఫ్యామిలీ హీరో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీలోని టాప్ హీరోల‌లో ఒక‌డు. టాలీవుడ్‌లో తొలి రూ.50 కోట్ల హీరోగా రికార్డుల‌కు ఎక్కిన చెర్రీ న‌టించిన 9 సినిమాల‌లో ఏకంగా 6 సినిమాలు రూ.40 కోట్ల క్ల‌బ్‌లో చేరాయి. అయినా ఏం లాభం… ఇంట్లో ఎంత గెలిచినా.. వీధిలో మాత్రం చ‌ర‌ణ్ పిల్లి. ఓవ‌ర్సీస్‌లో నాని లాంటి హీరోలు సైతం స‌లువుగానే మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేస్తున్నారు.

చెర్రీ మిలియ‌న్ మార్క్ కాదు క‌దా…ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నోడికి అక్క‌డ హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు రూ.4 కోట్లు. అది కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన సినిమా గోవిందుడు అంద‌రివాడేలే సినిమాకు ఆ మాత్రం వ‌సూళ్లు వ‌చ్చాయి. విదేశాల్లో రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోరు. మ‌నోడి సినిమాలు మ‌రీ రొటీన్ గా ఉంటాయ‌ని అక్క‌డోళ్ల కంప్లైంట్. దాంతో చ‌ర‌ణ్ కు ఓవ‌ర్సీస్ మార్కెట్ రాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మిలియ‌న్ మార్క్ దాట‌ని స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే.

నాని గ‌తేడాది భలేభ‌లే మ‌గాడివోయ్ తో మిలియ‌న్ మార్క్ అందుకుని చ‌ర‌ణ్ కు తొలి స‌వాల్ విసిరాడు. ఇక ఈ ఏడాది నితిన్ కూడా 2 మిలియ‌న్ మార్క్ దాటేసాడు. టాలీవుడ్ టాప్ 3లో ఒక‌టిగానిలిచింది నితిన్ అ..ఆ.. అంతెందుకు ఇప్పుడు నిఖిల్ కూడా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో ఓవ‌ర్సీస్ మార్కెట్ షేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టికే అక్క‌డ రూ.3 కోట్లు వ‌సూలు చేసింది.

ఈ సినిమా చెర్రీ గోవిందుడు రికార్డులు సైతం దాటేలా క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే నిఖిల్ కూడా చెర్రీకి షాక్ ఇచ్చిన‌ట్టే. సో ఈ లెక్క‌న చూస్తే నిఖిల్ కంటే కూడా చెర్రీ వీక్‌గానే క‌నిపిస్తున్నాడు. మ‌రి చెర్రీ తాజా చిత్రం ధృవ‌తో అయినా అక్క‌డ మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేస్తాడో లేదో చూడాలి.