యంగ్ హీరోతో ఎఫైర్‌పై స్పందించిన సీనియ‌ర్ హీరోయిన్

షారుక్ ఖాన్ దిల్ సే సినిమాలోని చ‌య్య చ‌య్య ..చ‌లి చ‌య్య సాంగ్‌తో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది మ‌లైకా అరోరా. ఆ త‌ర్వాత మ‌లైకా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే బెస్ట్ క‌పుల్స్‌గా పేరున్న ఈ జంట కొద్ది రోజులుగా వేర్వేరుగా ఉండ‌డంతో పాటు విడాకుల‌కు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

బోనీక‌పూర్ కుమారుడు, బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్‌తో మ‌లైకా ఎఫైర్ పెట్టుకోవ‌డంతో మ‌లైక‌-అర్బాజ్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పూడ్చ‌లేని అగాధం ఏర్ప‌డింది. స‌ల్మాన్ సైతం వీరిని క‌లిపేందుకు చేసిన విశ్వ‌ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. కొద్ది రోజుల క్రితం మ‌లైక అర్ధ‌రాత్రి టైంలో అర్జున్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

ఈ జంట ఎఫైర్ వార్త‌లు దేశ‌వ్యాప్తంగా జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక అర్జున్ తండ్రి బోనీక‌పూర్ సైతం ఈ విష‌యంలో త‌న కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక అర్జున్‌తో ఎఫైర్ వార్త‌ల‌పై మ‌లైకా తొలిసారిగా నోరు విప్పింది. అర్జున్ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని…త‌మ‌ను ప్ర‌జ‌లు అపార్థం చేసుకుంటున్నార‌ని ఆమె వాపోయింది.

మ‌లైకా ఈ విష‌యంలో ఎంత క్లారిటీ ఇచ్చినా..వారిద్ద‌రు తిరుగుతున్న తీరు, వ్య‌వ‌హ‌రిస్తోన్న తంతు చూసిన బీ టౌన్ జ‌నాలు మాత్రం ఆమె మాట‌లు న‌మ్మే స్థితిలో లేరు. అటు అర్బాజ్ సైతం మ‌రో అమ్మాయితో ప్రేమ‌లో మునిగి తేలుతున్నాడ‌ట‌. ఈ గ్యాపే వీరి బంధం బ్రేకప్‌కు కారణమైందని రుమర్లు వినిపిస్తున్నాయి.