బాలీవుడ్ బాలాదూర్ అంటోన్న రాజ‌మౌళి

నిజ‌మే! బాహుబ‌లి మేక‌ర్.. జ‌క్క‌న్న ఇలానే అంటున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌కు అంత లేద‌ని ఆయ‌న చెబుతున్నార‌ట‌. దీనంత‌టికీ కార‌ణం ఏంటంటే.. వ‌ర‌ల్డ్ స్థాయిలో తాను క‌ష్ట‌ప‌డి బాహుబ‌లిని తెర‌మీద‌కి ఎక్కించ‌డ‌మే. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి సృష్టించిన రికార్డ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీకీ ద‌క్క‌లేదు. ఈమూవీలో వాడిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ రెప్ప‌వేయ నీయ‌కుండా ఆడియ‌న్స్‌ని ఉర్రూత‌లూగిస్తాయి. అలాంటి అద్భుత‌మైన మూవీని అందించిన రాజ‌మౌళిని ఇప్ప‌టికీ కొంద‌రు టాలీవుడ్ డైరెక్ట‌ర్ అని అంటున్నార‌ట‌.

ఈ విష‌యం ఆ నోటా ఈనోటా ప‌డి చివ‌రికి జ‌క్క‌న్న చెవికి చేరింది. దీంతో సాధార‌ణంగా కోపం న‌షాళానికి అంటింద‌ట జ‌క్క‌న్న‌కి. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్లు కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని జ‌క్క‌న్నని టాలీవుడ్‌కే ప‌రిమితం చేయాల‌ని భావిస్తున్నారంట‌. దీంతో తీవ్ర‌స్థాయిలో కోపం తెచ్చుకున్న రాజ‌మౌళి.. బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ల‌పై ఎక్కిదిగార‌ని టాక్ న‌డుస్తోంది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌లో అంత ప‌స‌లేద‌ని పైకే అనేశాడ‌ట రాజ‌మౌళి.

ప్ర‌స్తుతం బాహుబ‌లి-2 మేకింగ్‌లో బిజీగా ఉన్న రాజ‌మౌళి.. దీనికి సంబంధించిన వీడియో  ‘స్వార్డ్ ఆఫ్ బాహుబలి’ రూపకల్పన చేస్తున్నాడ‌ట‌. ఒక సినిమాకు ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించే దర్శకుడు బాలీవుడ్‌లో ఒక్కరు కూడా లేరని అన్నాడు రాజమౌళి. అంతేకాదు, గతంలో తనను కలిసిన ఒక బాలీవుడ్ డైరెక్టర్‌తో.. ‘బాలీవుడ్ పరిశ్రమలో ఎంతోమంది పనికిరాని దర్శకులు ఉన్నారు’ అని నేరుగా అన్నాడట రాజమౌళి.  సో.. ఈ ర‌కంగా త‌న క‌సిని తీర్చేసుకున్నాడ‌న్న మాట మ‌న జ‌క్క‌న్న‌. ఏదేమైనా.. జ‌క్క‌న్న కామెంట్లో నిజం ఉంది అని ఇప్పుడు అంద‌రూ ఒప్పేసుకుంటున్నారంట‌!