హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ బాసూ

పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో కళ్యాణ్‌రామ్‌ ఒకడు. అభిరుచిగల నిర్మాతగా విలక్షణ సినిమాలు చేసిన ఈ నందమూరి హీరో, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇజం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్ట్‌గా కనిపించనున్న విషయం తెలుసు కదా. అయితే కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో వీరోచిత పోరాటాలు చేస్తుండడం చూస్తోంటే, పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ మూవీలా కనిపిస్తోంది. ‘ఇజం’ టీజర్‌ని వినాయక చవితి కానుకగా విడుదల చేశారు. టీజర్‌ వచ్చిన తరువాత అందరిదీ ఒకటే మాట, ఇది హాలీవుడ్‌ సినిమాగానీ కాదు కదా? అని. పూరి సినిమాల్లో హాలీవుడ్‌ పోకడలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సినిమాలో ఇంకా ఎక్కువగానే ఆ పోకడలున్నాయి.

ఏదో తీశాం అంటే తీశాం అన్నట్లుగా కాకుండా టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ సినిమా తీశారని అర్థమవుతోంది. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ‘పటాస్‌’. దాన్ని మించి, కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిలా ఉండేలా ‘ఇజం’ చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నాడట. అదితి ఆర్య ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. సినిమాలో కళ్యాణ్‌రామ్‌ స్టైలింగ్‌ చూస్తే ‘హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ బాసూ’ అనకుండా ఉండలేం. సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ మాత్రమే కాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడట కళ్యాణ్‌రామ్‌ ‘ఇజం’ సినిమా గురించి. అదీ కళ్యాణ్‌రామ్‌ డెడికేషన్‌ అంటే.