మెగాస్టార్‌ విత్‌ స్టైలిష్‌ స్టార్‌.

మెగాస్టార్‌ ప్రస్తుతం 150వ సినిమా ‘ఖైదీ నెం 150’లో నటిస్తున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. శరవేగంగా షూటింగ్‌ కార్యమ్రాలు జరుపుకుంటోంది. మరో పక్క అల్లు అర్జున్‌ హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ‘డిజె(దువ్వాడ జగన్నాధం)’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌, స్టైలిష్‌ స్టార్‌ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ఓ హాట్‌ టాపిక్‌. అది ఒక కన్నడ మూవీ అట. కన్నడంలో సూపర్‌ సక్సెస్‌ అయిన ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. ఆ సినిమాలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరో కాగా, మెగాస్టార్‌ ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారట.

ఈ సినిమాకి ఒక క్రేజీ టైటిల్‌ని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారమ్‌. అల్లు అర్జున్‌కి స్టైలిష్‌ స్టార్‌ అనే బిరుదు ఇచ్చిందే మెగాస్టార్‌ చిరంజీవి. మెగాస్టార్‌తో కలిసి నటించాలని ఏ హీరోకి మాత్రం ఉండదు. అలాగే అల్లు అర్జున్‌కి కూడా. గతంలో ‘డాడీ’, ‘శంకర్‌ దాదా ఎమ్‌బిబియస్‌’ వంటి చిత్రాల్లో పాటల్లో జస్ట్‌ అలా చిరుతో కలిసి చిందేశాడు అల్లు అర్జున్‌. కానీ ఈ సినిమాలో చిరంజీవితో కలిసి కొన్ని ఇంపార్టెంట్‌ సీన్స్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఓ ప్రముఖ కన్నడ భామ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.