ప్రత్యేక హోదా ఆక్ పాక్ కరేపాక్:సుజనా

మనిషి ఆశాజీవి అని ఏ పెద్దమనిషి అన్నాడో కానీ..మనుషుల్లో తెలుగు మనుషులంతా ఆశాజీవులు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది.ప్రత్యేక హోదా మెం ఇవ్వము అని కేంద్రం మొహం మీద మొత్తి మరీ చెప్తున్నా మనలో ఆశ చావడం లేదు.ఎప్పుడు ఏ తలమాసిన ప్రతినిధి ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకొచ్చినా అందరం ఇదేదో ప్రకటన వచ్చేస్తుందని వెర్రి వెంగళప్పల్లా ఎదురుచూడడం వాళ్లేమో మనకు అర్థం కానీ..అర్థం చేసుకోలేని..మాటల్తో నిస్సిగ్గుగా మనల్ని వంచిస్తునే వున్నారు.

తాజాగా కేంద్ర మంత్రివర్యలు టీడీపీ కోశాధికారి సుజనా చౌదరిగారు గత 3 రోజులుగా కేంద్రం లో బీజేపీ పెద్దలందిరితో మంతనాలు జరుపుతూ ప్రత్యేకహోదా తెచ్చే అర్జునుడిని నేనే అన్నంత బిల్డుప్ ఇచ్చి ఈ రోజు మీడియా ముందుకొచ్చి యుద్ధం లో గెలిచిన వీరుడిలా ఫోజ్ ఇచ్చేసరికి అందరు ఇంకేముంది ప్రత్యేక హోదా వచ్చేస్తుందని చెప్తాడని ఆశపడ్డ మాట వాస్తవం.

ఛీ ఛీ..తూ ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే వీళ్ళా మన నాయకులు..వీళ్ళా ప్రత్యేకహోదా తెస్తారని మనం ఇంకా ఆశిస్తోంది అని మనమీద మనకే అసహ్యం వేస్తుంది.అయినా కేంద్రం ఇవ్వదు..లేకపోతే ఇచ్చేటట్టు లేదు..అని చెప్పేస్తే సమస్యే లేదు.అలా చెప్తే అయన ది గ్రేట్ బిజినెస్ మాన్ సుజనా చౌదరి ఎందుకవుతారు..చక్కగా హుందాగా సరదాగా నవ్వుతూ..రిలాక్స్డ్ గా చూస్తున్నారు..చేస్తామంటున్నారు..చూద్దాం..ఆశిస్తున్నాం..ఇలా మాట్లాడుతుంటే మీకేమోకాని సుజనా గారూ మాలాంటి సామాన్యులకి మాత్రం పుండు మీద గొడ్డు కారం చల్లినట్టుగా వుంది.

ప్రత్యేక హోదా ఇవ్వము అనలేదు..సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు..ప్రత్యేక హోదా వల్ల ఎంత బెనిఫిట్ వస్తుందో ఆ లెక్కల్ని కేంద్ర పరిశీలిస్తోంది.మేము ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాం..అయినా మనకూ పట్టువిడుపులుండాలి..అయినా సరే మెం ఇప్పటికీ ప్రత్యేకహోదాకై కట్టుబడ్డాం.ఆరోజు కాంగ్రెస్ బిల్లులో పెట్టుంటే ఈ మాకు ఈ సమస్యే ఉండేది కాదు.మా అధ్యక్షుడు చంద్రబాబు ఈ విషయం లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..ప్లీజ్ సుజనా గారూ ఒకే ఒక్క హెల్ప్ చెయ్యండి.మాట్లాడటం ఆపెయ్యండి చాలు. మీ ఎంపీ టీజీ వెంకటేష్ భాషలో చెప్పాలంటే మీరు ఇలా మాట్లాడుతూ ఇక్కడ కాబట్టి ఇంకా రాజకీయాల్లో చలామణి అవుతున్నారు కానీ అదే వేరే చోటయితే గుడ్డలూడదీసి కొట్టేవారు.

సిగ్గు పడాలి సుజనా చౌదరి.బీజేపీ నయవంచన చేస్తుంటే..మీరు ఏకంగా తెలుగు ప్రజల గొంతే కోసేస్తున్నారు..అదికూడా విషం పూసిన సుతిమెత్తటి కత్తితో.చరిత్ర మిమ్మల్ని ఏ మాత్రం క్షమించదు.తప్పించుకు తిరగడానికి అతి తెలివి మాటల ప్రదర్శన చేయడం సిగ్గుమాలిన చర్య.ఏమన్నవ్ ఆవేశపడితే అన్ని అయిపోవా..సాద్యా సాధ్యాలు చూసుకోవాలా..బస్సులు రైళ్లు ఆపేస్తే ఒరిగేదేమి లేదా..ఛీ.నీ తో కూడా చెప్పించుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాం,

మన ఖర్మ కాకపోతే వీళ్ళా తెలుగోడి ఆత్మా గౌరవానికి ఢిల్లీలో ప్రతినిధులు.తూ..తప్పించుకు తిరిగేవాడు తెలుగోడు కాదు సుజనా గారూ ఎదురొడ్డి పోరాడే వాడే తెలుగోడు..సాధించే వాడే తెలుగోడు..మీలా మీడియా ముందు బొంకులు బొంకే వాడు కాదు తెలుగోడు..ఛీ..దీనిపై ఇంతకంటే విశ్లేషించడానికి కూడా మనసోప్పడం లేదు..ప్లీజ్ భవిష్యత్ లో మల్లి మీరు ప్రత్యేకహోదా పై మాట్లాడకండి చౌదరి గారూ..చేతనైతే మౌనంగా ఉండేది కానీ ఇలాంటి నీతిమాలిన ప్రెస్సుమీట్లు మాత్రం పెట్టకండి ప్లీజ్.