చంద్రబాబు ఇంటిముందే చస్తా:శివాజీ

ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలపై అన్ని వర్గాలనుండి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.ఎంతో చక్కగా అంతకంటే సృజనాత్మకంగా సుజనా చౌదరి మాట్లాడినతీరు నిజంగా సిగ్గుచేటు.ఎంతయినా వ్యాపారవేత్త చక్కగా ఇచ్చిపుచ్చ్చుకునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని కూడా కేంద్రం ముందు వ్యాపారం చేసేసాడు చౌదరి బాబు.

ఈ విషయం పై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు,సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.సుజనా చౌదరి చేతగాని రాజకీయాలు మానుకో.నిన్నెవడన్నా ప్రెస్ మీట్ పెట్టమని అడిగారా?ఎవరి కోసం ఈ మాయమాటలు అంటూ ప్రశ్నించాడు శివాజీ.ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ని సైతం శివాజీ వదల్లేదు.చంద్రబాబుగారూ మీరు గాని హోదా కాదని ప్యాకేజీ కి ఒప్పుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.శివాజీ మీ ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటాడు అని తీవ్ర స్థాయిలో మంది పడ్డాడు శివాజీ.

మీ రాజకీయ నాయకులు ఇచ్చిన మాట మర్చిపోతారేమో కానీ నేను అలా కాదు.మీరు ప్యాకేజీ కి ఒప్పుకుంటే చచ్చి తీరుతా అది కూడా మీ ఇంటిముందే.అయినా శివాజీ గారూ రేపు చుడండి..ఇదే విషయాన్నీ మన పచ్చ మీడియా ఎంత చక్కగా తేనె పలుకులతో ప్రజల్లోకి తీసుకెళ్తుందో..ఆల్రెడీ మొదలుపెట్టాశారు ఆ కార్యక్రమాన్ని..అసలు ఈ మాత్రం అయినా కేంద్రం ఆంద్రప్రదేశ్ ని కరుణించింది అంటే అదంతా సీఎం చంద్రబాబు గారి చలువే అంటారు.ఆ పోరాట యోధుడి విజయ గాధలు పుంఖాను పుంఖాలుగా ప్రచురిస్తారు చూడండి.