సమంతా ఈ టైంలో ఎంపనులవి?

ఈ మధ్య క్యూట్‌ బ్యూటీ సమంత పెళ్లి వార్తలు హాట్‌ టాపిక్స్‌గా నిలిచాయి మీడియాలో. ఇంకేముంది రేపో మాపో సమంత పెళ్లి పీటలెక్కనుంది అని ఆశక్తితో ఎదురు చూశారంతా. నాగ చైతన్యతో సమంత పెళ్లి ఊసుపై రోజుకో వార్త బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యింది. కానీ ప్రస్తుతం ఈ విషయంపై ఏ చిన్న ఇన్‌ఫర్‌మేషన్‌ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉంటే సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక జాలీడే ట్రిప్‌కి వెళ్లింది. ఈ ట్రిప్‌లో సమంత తన హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోయిందట. అక్కడెవరూ తనను గుర్తుపట్టరు గనుక, రియల్‌ సమంత అక్కడ ఆవిష్కృతమయ్యిందట. రోజుకో రకం హాట్‌ డ్రెస్సు వేసుకుని ఎంజాయ్‌ చేస్తోంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాకి ఎక్కాయి. సమంతతోపాటుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రెజినా ఈ టూర్‌లో సందడి చేశారు. ఎవ్వరూ తగ్గలేదు ఒకర్ని మించిన హాట్‌ డ్రస్సులతో ఇంకొకరు సందడి చేశారు.

విదేశీ ట్రెండ్‌కి తగ్గట్టుగా కురుచదుస్తుల్లో అందాల భామలు మెరిసిపోతోంటే, చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవేమో అనేంతలా వారి గ్లామర్‌ అక్కడివారిని అలరించిందట. అందరిలోకీ సమంత మరీ హాట్‌గా కనిపించింది. వెండితెరపై సమంత క్యూట్‌ క్యూట్‌గా కనిపిస్తుంటే ఆ కిక్కే వేరప్పా. కానీ సమంత క్యూట్‌నెస్‌ వెనుక ఇంత హాట్‌ అప్పీల్‌ ఉందని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. అఫ్‌కోర్స్‌ క్యూట్‌గా నటిస్తూనే వెండితెరపై హాట్‌ అప్పీల్‌ పంచడం సమంతకి బాగా తెలిసిన విషయమే.