చిరంజీవి స్టార్‌డమ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌.

స్టార్‌డమ్‌ అంటే సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించడమే కాదు. జయాపజయాలకు అతీతంగా వసూళ్లను రాబట్టడం. చిరంజీతి కెరీర్‌లో లాస్‌ సినిమాలంటూ ఏమీ లేవు. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం నష్టపోలేదు. అది చిరంజీవి అంటే. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు. మెగాస్టార్‌ ఎప్పుడూ అభిమానుల గుండెల్లో ఖైదీగానే బంధీ అయ్యి ఉన్నారు. మెగాస్టార్‌ని అభిమానించిని వారు ఉండరు. కేవలం సామాన్య జనమే కాకుండా, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు కూడా చిరు అంటే అభిమానం. ఇక ప్రతీ యంగ్‌ హీరోకీ, చిరంజీవే ఇన్సిపిరేషన్‌. అది అసలు స్టార్‌ డమ్‌ అంటే.

ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్‌ ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా కానీ ఆయన ప్రభావం ఏమాత్రం పోలేదు. తొమిదేళ్ల తర్వాత ఆయన అంతే ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లోకి రావడం పట్ల యావత్‌ సినీ జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో వస్తోన్న చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’. ఈ సినిమాకి తొలిసారిగా రాంచరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నయ్య చిరంజీవి కోసం కొరియోగ్రఫర్‌గా మళ్లీ తెలుగులోకి అడుగుపెడుతున్నారు ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా. భారీ హంగులూ, అంచనాలతో బాక్సాఫీస్‌ని రూల్‌ చేయడానికి వచ్చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.