చిరంజీవి సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు

చిరంజీవికి సునీల్‌ వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరో అయినాక సునీల్‌ కమెడియన్‌గా ఎక్కడా కనిపించలేదు. పెద్ద స్టార్స్‌ సినిమాల్లో చేయమని అడిగినా కూడా సునీల్‌ ఆ అవకాశాల్ని కాదనుకున్నాడు. కానీ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చేసరికి మారు మాట్లాడకుండా ఓకే అనేశాడు. అదీ చిరంజీవిపై సునీల్‌కున్న అభిమానం.

తన హీరో ఇమేజ్‌ని పక్కన పెట్టేసి అన్నయ్య కోసం ఏ చిన్న క్యారెక్టర్‌ అయిన చేయడానికి రెఢీ అంటూ ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమాలో సునీల్‌ కోసం ఒక ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌ని డిజైన్‌ చేశాడట డైరెక్టర్‌ వినాయక్‌. ఆ ట్రాక్‌లో సీన్స్‌ అన్నీ చిరంజీవికి, సునీల్‌కి మధ్యనే నడుస్తాయట. ఈ సీన్స్‌ సినిమాకి చాలా పెద్ద ప్లస్‌ కానున్నాయట.

అంతేకాదు ఈ సినిమాలో కమెడియన్‌ ఆలీ కూడా నటిస్తున్నాడు. కానీ సునీల్‌ కామెడీ ట్రాక్‌ డిఫరెంట్‌గా హైలైట్‌గా తెరకెక్కించనున్నారట. వచ్చే నెల్లో ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమా కూడా విడుదల కానుంది. ఈ లోపల అన్నయ్య సినిమా కోసం ‘కత్తిలాంటోడు’ సినిమా సెట్‌లో హడావిడి చేస్తున్నాడు సునీల్‌. ఈ అప్పియరెన్స్‌ సినిమాకే కాకుండా, సునీల్‌ కెరీర్‌కి కూడా ప్లస్‌ కానుందంటున్నారు సినీ వర్గాలు.