థమన్ కి ‘మెగా’ టెన్షన్

యువ సంగీత సంచలనం అనిపించుకున్న ఎస్ ఎస్ తమన్ కు.. అవకాశాలు తగ్గిపోయాయి. వరుసగా భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేసేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉన్నవి తక్కువ సినిమాలే.

ఆగస్ట్ 5న విడుదల కానున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆగస్ట్ 13న రిలీజ్ అవుతున్న తిక్క సినిమాలకు తమన్ బాణీలు సమకూర్చాడు. ఈ రెండు తప్ప అతడి చేతిలో భారీ ప్రాజెక్టులేమీ లేని స్థితి. ఒక వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాలు.. మెగా ఫ్యామిలీ హీరోలవే. ఈ రెండు సినిమా కథాంశాలు, నేపథ్యాలు వైవిధ్యమైనవి కావడం విశేషం. సాయిధరమ్ తేజ్ ‘తిక్క’..కంప్లీట్ మాస్ మూవీ. అల్లు శిరీష్ మూవీ శ్రీరస్తు శుభమస్తు అయితే ఫ్యామిలీ ఓరియెంటెడ్.

వారం గ్యాప్ లో తమన్‌ నుంచి రెండు పూర్తి డిఫరెంట్ ఆల్బమ్స్ విడుదల కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ రెండు చిత్రాలకు ఇంకా ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు. ఈ వేడుకలు కూడా వరుసగానే జరిగే ఛాన్స్ ఉంది. తిక్క.. శ్రీరస్తు శుభమస్తు ఈ రెండింటిలో ఏది క్లిక్ అయినా.. తమన్ కి మంచిరోజులు వచ్చినట్టే. ఆయనకు మళ్లీ అవకాశాలు వెల్లువెత్తడం ఖాయమని చెప్పచ్చు. మరి తమన్ ఈ మెగా పరీక్షను పాస్ అవుతాడో లేదో చూడాలి.