ఆవిషయం లో రష్మీ బాగా సహకరిస్తోందట

సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నా రష్మికి మాత్రం పాపులారిటీ పెరిగిపోతోంది. ‘గుంటూరు టాకీస్‌’ ఓకే, ‘అంతం’ నిరాశపర్చింది. ఇంకా చేతిలో చాలా సినిమాలున్నాయి. అవకాశాలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. రష్మి లక్కే లక్కు. మొదటి విడతలో రష్మికి హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్లే లభించాయి. ఇప్పుడలా కాదు. ఆమె లక్కు నక్కతోక తొక్కినట్టుంది. ఛాన్సుల మీద ఛాన్సులతో టాలీవుడ్‌కి హాట్‌ ప్రాపర్టీ అయ్యింది రష్మి.

తన తాజా చిత్రం ‘రాణిగారి బంగ్లా’లో రష్మి పర్ఫామెన్స్‌ సూపరో సూపరట. ‘గబ్బర్‌సింగ్‌లా ఉండాలి’ అంటూ ఈ టీజర్‌లో రష్మి రెచ్చిపోయింది. ఇదో కామెడీ టచ్‌ ఉన్న థ్రిల్లర్‌. రష్మి నటిస్తున్న సినిమాలన్నీ థ్రిల్లర్‌ జోనర్‌లోనే వస్తున్నాయెందుకో. ఏదైతేనేం అవకాశాలొస్తున్నాయి, ఆ అవకాశాల్ని రష్మి సద్వినియోగం చేసుకుంటోందంతే. రష్మి ఒప్పుకుంటున్న సినిమాలన్నీ శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్నవే.

నిర్మాతలకి డేట్స్‌ విషయంలో రష్మి బాగా సహకరిస్తోందట. ఓ పక్క బుల్లితెరపై షోస్‌లో కనిపిస్తూనే ఇంకోపక్క సినిమాలకి టైమ్‌ కేటాయించడంలో రష్మి స్పీడ్‌ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అలా మేనేజ్‌ చేసుకుంటేనే రష్మి వెండితెరపైనా, బుల్లితెరపైనా ఎట్‌ ఎ టైమ్‌ వెలిగిపోతోంది మరి. ఇప్పటిదాకా చేసిన సినిమాలకన్నా ‘రాణిగారి బంగ్లా’ ఇంకా ప్రత్యేకమైనదంటున్న రష్మి, ఈ సినిమాతో నటిగా తాను ఓ మెట్టు పైకెక్కుతానని ధీమాగా చెప్తోంది. ఆల్‌ ది బెస్ట్‌ టు రష్మి.