క్రాప్ హాలిడే చూసాం..ఇప్పుడు కబాలి హాలిడే

రైతులంతా వ్యవసాయానికి మద్దతు ధర లభించడం లేదని క్రాప్ హాలిడే ప్రకటించడం మనం చూసాం.అది నిరసన.అయితే పలు కంపెనీ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ కబాలి రిలీజ్ డేట్ ఈ నెల 22 న సెలవు దీనగా ప్రకటించి కబాలి హాలిడే డిక్లేర్ చేశారు.కాక పోతే ఇది నిరసన హాలిడే కాదు కేవలం రజిని మేనియా .

ట్రైలర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన కబాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్, మార్కెటింగ్, టికెట్ సేల్స్ లో సంచలనాలు సృష్టిస్తూ వస్తోంది. సూపర్ స్టార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే కబాలి మేనియాను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు సెలవులు ప్రకటించాయి.

రజిని సినిమా అంటే చిన్న పెద్ద తేడా లేదు..కంపెనీ అయినా కాలేజ్ అయినా మూకుమ్మడి సెలవులు ఖాయం.ఒక వేల సెలవు ఇవ్వకున్నా ఏదో ఒక వంకతో అయినా సెలవు పెట్టేస్తారు.బెంగళూరులో ఉన్న వాటర్‌ ప్రూఫ్‌ కంపెనీ ఓపస్‌, చెన్నైలోని ఫైండస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు కబాలి మేనియాను ముందుగానే గుర్తించాయి. అందుకే 22న కబాలి హాలిడే ఇస్తున్నట్లు నోటీస్ పెట్టాయి.ఇవేకాదు చాలా కంపెనీ లు హాలిడే ప్రకటన జారీ చేయకున్నా హాలిడే కిందే లెక్క ఆ రోజున అన్న అంచనాకు వచ్చేసినట్టు సమాచారం. తలైవా నా మజాకా..