కబాలి కలెక్షన్స్:ఇదీ అసలు లెక్క

కబాలి రిలీజ్ అయింది.డివైడ్ టాక్ తో ఓ పక్క, డిజాస్టర్ టాక్ తో మరో పక్క సినిమా నడుస్తోంది.అయితే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కబాలి అని చెప్పుకొస్తున్న తమిళ తంబీలు కలెక్షన్స్ విషయంలో తలా ఓ నెంబర్ చేప్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు.సినిమా కి ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఈ లెక్కలేంటా అని సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నారు.

మొదటి రోజు 100 కోట్లని నిర్మాత కలైపులి థాను మొదట ప్రకటించాడు.ఆయనే ఆ తరువాత మొదటి రోజే 250 కోట్లు కలెక్ట్ చేసింది కబాలి అని ప్రకటించాడు.అదలా ఉంటే వాస్తవానికి కబాలి మొదటి రోజు సల్మాన్ ఖాన్ సుల్తాన్ కలెక్షన్స్ 35 క్రోర్స్ ని క్రాస్ చేసి 40+ క్రోర్స్ కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం.

అయితే తాజాగా థాను ఇంకో బాంబు పేల్చాడు.రజనీకాంత్ మూవీ తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.211కోట్లు దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తుంటే నిర్మాత కలైపులి థాను మాత్రం రూ.400కోట్లని లెక్కలు చెప్తున్నారు.కబాలి కలెక్షన్స్‌పై థాను లెక్క బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే.. తాను సరిగ్గానే కాలిక్యులేట్ చేశానని థాను చెప్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌ ద్వారా వచ్చిన సొమ్మును కూడా ప్లస్ చేసుకుని ఆయన తమ మూవీ రూ.400కోట్లు సాధించిందని అంటున్నారు. నెగెటివ్ టాక్ వచ్చినా సినిమాకి ఇన్నివందల కోట్లా అనేదే ఇప్పుడు సగటు ప్రేక్షకుడిని విస్మయానికి గురిచేస్తోంది.అయినా రజినీకాంత్ తలచుకుంటే ఏదయినా సాధ్యమే అంటే ఇదేనేమో.