బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో నటించడం కన్నా ప్రచార కర్తలుగా పని చేయడానికి ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మిగతా స్టార్స్‌ది ఒక లెక్క. వారిలో బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనెది మరో లెక్క అయిపోయింది. ఈ భామ ఏకంగా ఆ సంస్థకు ప్రచార కర్తగా పని చేయడానికి 8 కోట్లు డిమాండ్ చేయడం విశేషం. మామూలుగా ఒక్క రోజు షూటింగ్‌కే రెండు కోట్లు డిమాండ్ పలుకుతూ ఉంటుంది. అదే రెండు, మూడు రోజులకి అయితే మరి కొంచెం కన్సిడర్ చేస్తారు. అలాంటిది మూడు రోజుల షూటింగ్ కోసం దీపికా ఏకంగా 8 కోట్లు డిమాండ్ చేయడం అన్నది టూ మచ్. కానీ ఆమెకున్న డిమాండ్‌తో ఆ రేటుకి ఆ సంస్థ ఆమెను ఓకే చేసిందని సమాచారమ్. దీంతో ఆ సంస్థ దేనికి సంబంధించింది, ఆ ప్రొడక్ట్ ఎంత కాస్ట్లీ ఐటెం అనేదాని గురించి బాలీవుడ్లో డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ఇంత వరకూ బాలీవుడ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసినందుకు ఏ హీరోయిన్ తీసుకోని అమౌంట్ దీపిక తీసుకున్నట్లువుతోంది. ప్రస్తుతం ఆమె డిమాండ్ అక్కడ అలా నడుస్తోంది మరి. డిమాండ్ ఉన్న చోట రేటు అలానే ఉంటుంది కదా! దీపికానా మజాకానా.