రాజశేఖర్‌కి చిరంజీవి ఛాన్సివ్వలేదా?

చిరంజీవి 150వ సినిమాలో విలన్‌గా నటించాలనుకుంటున్నాడు రాజశేఖర్‌. కానీ చిరంజీవి నుంచి స్పందన సానుకూలంగా రాలేదట. దాంతో ఇంకో పెద్ద హీరోకి విలన్‌గా చేయాలని ప్రయత్నించి అక్కడ కూడా నిరాశపడ్డాడు రాజశేఖర్‌. ప్రస్తుతం హీరోగానూ రాజశేఖర్‌ కెరీర్‌ అంత బాగా లేదు. అందుకే విలన్‌గా ఫిక్స్‌ అయిపోదామనుకుంటే, ఎటు వెళ్లినా నిరాశే మిగిలింది ఈ యాంగ్రీ హీరోకి. అయితే తాజాగా విలన్‌గా చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలమయినట్లు సమాచారమ్‌. గోపీచంద్‌తో సినిమా ఒకటి ఖాయమయ్యిందని అంటున్నారు. బహుశా గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆక్సిజన్‌’ సినిమాలోనే విలన్‌గా రాజశేఖర్‌ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది కూడా ఇంకా ఫైనలైజ్‌ కాలేదట.

ఇంకోవైపున, ఓ ప్రముఖ హీరోతో రాజశేఖర్‌ సంప్రదింపులు జరుపుతున్నాడట. అది ఈ నెలలోనే కన్‌ఫామ్‌ అయ్యేలా ఉంది. గోపీచంద్‌ కమర్షియల్‌ హీరోనే అయినా, హీరోగా తనకు ఒకప్పుడు ఉన్న స్టార్‌డమ్‌తో, ఇంకా పెద్ద హీరోకి విలన్‌గా నటించి తన పరువు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడట రాజశేఖర్‌. హీరోగా అవకాశాలు లేనప్పుడు ఈ హీరో, ఆ హీరో అని చూడకుండా అంది వచ్చిన అవకాశాన్ని యుటిలైజ్‌ చేసుకోకుండా, కేవలం పాపులర్‌ హీరోకే విలన్‌గా చేస్తాను అని భీష్మించుకుని కూర్చోవడం రాజశేఖర్‌కి తగునా? పెద్ద హీరోతోనే విలన్‌గా తన కెరీర్‌ స్టార్ట్‌ చెయ్యాలనుకుంటున్న రాజశేఖర్‌కి ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలిక. హీరో కాకముందు విలన్‌గా ఎంట్రీ ఇచ్చిననాటి మూలాలు ఇంకా తనలో అలానే ఉన్నాయంటున్నాడు. అయితే తగిన అవకాశం కోసం మాత్రమే వెయిట్‌ చేస్తున్నానంటున్న రాజశేఖర్‌ ప్రయత్నాలేమవుతాయో వెయిట్‌ అండ్‌ సీ!