మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోన్న150వ చిత్రం కత్తిలాంటోడు చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. అయితే ఇంత వరకూ ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయకపోవడం విశేషం. మొదట్లో ఈ చిత్రంలో చిరు సరసన అనుష్క యాక్ట్ చేస్తోందనే టాక్ వినిపించినా తర్వాత నయనతార, దీపికా పదుకునే పేర్లు కూడా వినిపించాయి. కాని వీరిలో ఒక్కరిని కూడా హీరోయిన్ గా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయలేదు.
తాజాగా మరో హీరోయిన్ పేరు ఈ లిస్ట్ లో చేరింది. రాక్ స్టార్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ ఫక్రీని కత్తిలాంటోడు చిత్రంలో యాక్ట్ చేయించాలని మూవీ యూనిట్ భావిస్తోంది. చిరు ప్రెస్టీజియస్ మూవీకి ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ ప్రొడ్యూసర్ కాగా రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.