మెగాస్టార్‌ చిరంజీవి సర్వసన్నద్ధం

చిరంజీవి సినిమా కోసం పూర్తిగా సన్నద్ధమైపోయారు. పూర్తి హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లోకి వచ్చేశారు. రాజకీయాల్లో ఉంటూ, సినిమాల్లో నటించడం ఒకింత కష్టమైన ప్రక్రియే అయినప్పటికీ మెగాస్టార్‌ తన అభిమానుల కోరకను తీర్చడం కోసం కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. తమిళ్‌ సినిమా ‘కత్తి’కి రీమేక్‌గా రానున్న ఈ సినిమాకి ‘కత్తిలాంటోడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. వినాయక్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. హీరోయిన్‌ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. విదేశాల్లో కొన్ని పాటల చిత్రీకరణ జరుపుతారని సమాచారమ్‌. షూటింగ్‌ లొకేషన్స్‌ కూడా ఫైనల్‌ అయిపోయాయి. సినిమాలో చిరంజీవి లుక్‌ విషయంలో చాలా టెస్టులు చేసి ఒక డిఫరెంట్‌ లుక్‌ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే అది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచింది చిత్ర యూనిట్‌. చిరంజీవి గడ్డం పెంచి కనిపించడం వెనుక వ్యూహమే అది అట. అయితే సినిమాలో గడ్డంతో కనిపిస్తారా? లేదా? అనేది తెలియరావడం లేదు. చాలా లుక్స్‌లో కనిపించే అవకాశం ఉందని కూడా టాక్‌ వినిపిస్తోంది. యంగ్‌ ఆండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో క్లాస్‌గానూ, కొంచెం మాసిన గడ్డంతో మాస్‌లుక్స్‌లోనూ కూడా కనిపిస్తాడని సమాచారమ్‌. సెట్స్‌ మీదికెళ్లాక, షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేస్తారట. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజులు, ఇంకెన్నో స్పెషాలిటీస్‌ ఉన్నాయట. ఈ సినిమాకి రాంచరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్స్‌ కోసం కసరత్తులు చేస్తున్నాడు.