మళ్లీ పూరి నితిన్ – ఈసారి హార్ట్ ఎటాక్ ఎవరికో!!

పూరీ, నితిన్‌ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ,ఆ..’ సినిమాతో నితిన్‌ రేంజ్‌ మారిపోయింది. అనేక పరాజయాలను అనుభవించి, చాన్నాళ్ల తరువాత విజయం అందుకున్నాడు నితిన్‌. దీంతో నితిన్‌ కెరీర్‌లో మళ్ళీ జోరు పెరిగింది. ఆ జోష్‌లోనే కొత్త కొత్త కథలను వింటున్నాడు నితిన్‌. గతంలో పూరి జగన్నాథ్‌తో ‘హార్ట్‌ ఎటాక్‌’ చేసిన నితిన్‌, మళ్ళీ పూరితోనే ఇంకో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నాడు. నితిన్‌తో ఇంకో సినిమా చేస్తానని పూరి కూడా చెప్పాడు. అదిప్పుడు వర్కవుట్‌ అయ్యేలా ఉంది. తాజాగా పూరీ చెప్పిన కథ ఒకటి నితిన్‌కి నచ్చిందట. అది తన బాడీ లాంగ్వేజ్‌కి కరెక్ట్‌గా సూటయ్యే కథ అని ఫుల్‌ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు నితిన్‌.

పూరి సినిమాల్లో హీరోకి ఓ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌ ఉంటుంది. దాన్ని నితిన్‌, ‘హార్ట్‌ ఎటాక్‌’లో కొంతవరకు క్యారీ చెయ్యగలిగాడు. ఈసారి పూరితో నితిన్‌ సినిమా చేయడం ఖాయమైతే, పూరి మార్క్‌ హీరోగా నితిన్‌ పూర్తిస్థాయిలో మారిపోనున్నాడనడం నిస్సందేహం. ఈ సినిమా కోసం పూరి బాలీవుడ్‌ నుంచి ఓ కొత్త భామని తీసుకురాబోతున్నాడట. నితిన్‌కి ఉన్న క్లాస్‌ ఇమేజ్‌కి పూరి తనదైన మాస్‌ టచ్‌ ఇచ్చి, కమర్షియల్‌గా నితిన్‌తో ఓ బిగ్‌ సక్సెస్‌ కొట్టాలనే ఆలోచనతో పూరి ఉన్నాడని సమాచారమ్‌. ప్రస్తుతం పూరి, కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.