దీపిక లైఫ్‌లో కింగ్‌ఫిషర్ చీకటి కోణం!!

దీపిక పదుకొన్‌ యువతరం గుండెల్లో దిల్‌ కా ధడ్కన్‌. బాలీవుడ్‌లో క్రేజీయెస్‌‌ట హీరోయిన్‌. ఓవైపు కమర్షియల్‌ సినిమా నాయికగా రాణిస్తూనే, ప్రయోగాలతోనూ ఆకట్టుకుంటోంది. అయితే దీపిక ఇంత పెద్ద స్థాయికి ఎదగడం వెనక ఆసక్తికర సంగతులు ఉన్నాయి. వాస్తవానికి దీపిక ఓ క్రీడాకారిణి. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించింది. తరువాత మోడలింగ్‌ లోకి వచ్చి 2006లో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌గాళ్‌గా ఆలరించింది. ఇక అక్కడినుంచి సినిమా ఛాన్సులు వరించాయి. కన్నడ సినిమా ఐశ్వర్యతో కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌లో ఓం శాంతి ఓం చిత్రంతో తొలి అడుగులు వేసింది. తర్వాత బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు కోట్లలో పారితోషికాలు చెల్లించి హీరోయిన్‌గా అవకాశాలిచ్చారు.

కింగ్‌ ఫిషర్‌ మాల్యా ప్రతియేటా ఎంతోమంది మోడల్‌‌సని క్యాలెండర్‌గాళ్‌‌సగా పాపులర్‌ చేస్తుంటారు. అయితే ఈ రంగంలో చీకటి కోణం కూడా ఉంటుంది. అలా ఓ ఐదుగురు మోడల్‌‌స జీవితంలో జరిగిన విశేషాలతో మధుర్‌భండార్కర్‌ ‘క్యాలెండర్‌ గాళ్‌‌స’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ మోడల్‌ జీవితానికి దీపిక పదుకొన్‌ ఇన్‌స్పిరేషన్‌ అని చెబుతున్నాడు. ఓ మై గాడ్‌ ఏం చూపించాడో ఏంట. దీపిక లైఫ్‌లో చీకటి కోణం ఏదైనా ఉందంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.