అక్కినేని అఖిల్‌కి జోడీ కుదిరింది 

అక్కినేని అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ తర్వాత ఇంకా రెండో సినిమా మీద సైన్‌ చెయ్యనే లేదు. అప్పుడే జోడీ ఏంటనుకుంటున్నారా? ఇది సినిమా జోడీ కాదండీ. రియల్‌ లైఫ్‌ జోడీ. అఖిల్‌కు లైఫ్‌ పాట్నర్‌ దొరికింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసి వచ్చిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌కి ఎప్పట్నుంచో పరిచయం ఉందట. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారై ఈ శ్రియ భూపాల్‌. చాలా కాలంగా ఈ ఫ్యామిలీతో అక్కినేని ఫ్యామిలీకి దగ్గర రిలేషన్‌ ఉందట.

అఖిల్‌ తన ప్రేమ విషయాన్ని ఇరువురి ఇంట్లోని పెద్దలకు తెలియజేయగా, వారిరువురూ వీరి ప్రేమను అంగీకరించినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం అఖిల్‌ తన రెండో సినిమా మీద ఫోకస్‌ పెట్టాడు. ఈ సినిమా పూర్తయినాకనే పెళ్లి గురించి ఆలోచిస్తాడట. ఈ లోపల అన్నయ్య నాగచైతన్య పెళ్లి కూడా దగ్గర్లోనే ఉంది కదా. అన్నయ్య పెళ్లి తర్వాత తన పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేస్తానంటున్నాడు అఖిల్‌. ప్రసుతం అఖిల్‌ రెండో సినిమాపై సస్పెన్స్‌ అలా కొనసాగుతూనే ఉంది. చాలా కథలను వింటున్నాడు. ఫైనల్‌ డెసిషన్‌ తండ్రి నాగార్జున మీదే పెట్టడంతో నాగ్‌ నిర్ణయం మీదే అఖిల్‌ రెండో సినిమా భవిష్యత్తు ఉండబోతోంది అని తెలుస్తోంది. మొదటి సినిమా యాక్షన్‌ ప్రయోగంతో విఫలమైన అఖిల్‌, ఏది ఏమైనా రెండో సినిమా మాత్రం క్యూట్‌ లవ్‌ స్టోరీతో లవర్‌ బాయ్‌ గెటప్‌లోనే రావాలని అనుకుంటున్నాడట.