బాపట్ల టాప్..ఆ ఒక్కటే టీడీపీకి డౌట్?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక..అప్పటిలోనే చంద్రబాబు టీడీపీలో అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే. అందులో మొదటిగా జిల్లాల వారీగా అధ్యక్షులని తీసేసి..పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టిన విషయం తెలిసిందే..25 స్థానాలకు 25 అధ్యక్షులని పెట్టారు. ఇదంతా జిల్లాల విభజన జరగక ముందే జరిగింది. ఇక పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకురావడమే లక్ష్యంగా అధ్యక్షులు పనిచేస్తూ వస్తున్నారు. అయితే మొదట్లో కొందరు సరిగ్గా పనిచేయలేదు..తర్వాత తర్వాత కాస్త […]

నో డౌట్: విశాఖ లీడ్ చేంజ్?

ఇప్పుడు రాజకీయమంతా విశాఖ చుట్టూనే తిరుగుతుంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్‌తో వైసీపీ పోరాటం చేస్తుంది. అధికారంలో ఉండి కూడా…రాజధాని ఏర్పాటు చేయకుండా వైసీపీ పోరాట పంథా ఎంచుకోవడం వెనుక రాజకీయ కోణం క్లియర్‌గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నారు..పైగా మూడేళ్ళ ముందే మూడు రాజధానులు అన్నారు. కానీ ఇంతవరకు ఏది అమలు కాలేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకునే పరిస్తితి లేదు. ఇప్పుడు పోరాటం అంటే..ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ […]

‘కమ్మ’ సీట్లు క్లారిటీ..కానీ ఆయనకే డౌట్?

వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రధానత ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. యువతకు సీట్లు ఇస్తేనే..వారు యాక్టివ్ గా పనిచేసి గెలుపు గుర్రం ఎక్కుతారని బాబు నమ్ముతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎక్కువ మంది యువనేతలు పోటీ చేసే సక్సెస్ అయ్యారు. ఇక అదే ఫార్ములాతో బాబు ముందుకెళుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా యువతకు 40 శాతం సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. అదే దిశగా ముందుకెళుతున్నారు కూడా. ఇప్పటికే పలు స్థానాల్లో యువ నేతలకు […]

టీడీపీ కంచుకోటలో కొత్త అభ్యర్ధి..వైసీపీకి చెక్?

ప్రతి నియోజకవర్గంలో గెలుపు గుర్రాలని బరిలో దింపడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. గత ఎన్నికల మాదిరిగా చివరి నిమిషంలో అభ్యర్ధులని ప్రకటించడం, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు పెరిగిపోవడం లాంటివి జరగకుండా, మళ్ళీ పార్టీ నష్టపోకుండా ఉండటమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు. ఈ సారి ఖచ్చితంగా గెలిచి అధికారం దక్కించుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుని వెళుతున్న బాబు..ఇప్పటినుంచి నియోజకవర్గాల్లో బలమైన నాయకులని పెట్టుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పాత ఇంచార్జ్‌లని మార్చేసి కొత్త వారికి ఛాన్స్ […]

ఆళ్లగడ్డలో ట్విస్ట్..టీడీపీలో ఊహించని మార్పు?

ఆళ్లగడ్డ అంటే భూమా ఫ్యామిలీనే గుర్తొస్తుంది. ఆ నియోజకవర్గానికి కంచుకోటగా భూమా ఫ్యామిలీ మార్చుకుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే..ఆ పార్టీలో గెలిచేవారు. కానీ గత ఎన్నికల్లోనే ఆళ్లగడ్డ భూమా ఫ్యామిలీ చేతుల్లో నుంచి జారిపోయింది. అనూహ్యంగా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేసి ఓడిపోయారు. అయితే కొంతకాలం ఆమె యాక్టివ్ గానే తిరిగారు. కానీ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల యాక్టివ్ గా లేరు. అటు కొన్ని వివాదాలు కూడా భూమా ఫ్యామిలీ […]

మద్దిపాటికి లక్కీ ఛాన్స్..టీడీపీ రాత మారుతుందా?

వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. గతంలో కూడా యువతకు సీట్లు ఇస్తామని చెప్పారు గాని..ఆ విషయాన్ని ఆచరణలో ఎక్కువ పెట్టలేదు. కానీ ఈ సారి మాత్రం ఆచరణ దిశగానే బాబు ముందుకెళుతున్నారు. పలు సీట్లలో యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే పలు సీట్లలో ఇంచార్జ్‌లుగా యువ నేతలని పెట్టిన బాబు..తాజాగా గోపాలాపురం ఇంచార్జ్‌గా మద్దిపాటి వెంకటరాజుని నియమించారు. […]

బాబు లెక్కలు..మ్యాజిక్ ఫిగర్ రావట్లేదా?

నెక్స్ట్ ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో టీడీపీ అధినేత చంద్రబాబు పని చేస్తున్నారు..ఈ సారి కూడా అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు తెలుసు. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ సంగతి అంతే. కాబట్టి మళ్ళీ జగన్‌కు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి బాబు..టీడీపీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే వైసీపీపై వ్యతిరేకత బాగా ఉందని, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువ ఉందని, ఇక ప్రజలు తమ వైపు ఉంటారనే ధీమా టీడీపీ నేతల్లో […]

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్‌..!

“మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిందిలే.. ఇక‌, మ‌న ఇష్టం.. అడిగేవారు ఎవ‌రు? “ అనుకున్న వైసీపీ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు భారీ షాక్ త‌గిలింది. ఎందుకంటే.. గ‌తంలో వీరిపై న‌మోదైన కేసుల‌కు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ణ‌య‌మే తీసుకుంది. వైసీపీ ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ముందు కూడా.. అనేక సంద‌ర్భాల్లో వైసీపీ నేత‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్ర‌భుత్వం.. ఎలాంటి విచార‌ణ‌లు లేకుండా.. మూసేసే ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సంబంధించి […]

అభ్యర్ధుల లిస్ట్..కృష్ణా టీడీపీలో చిచ్చు..!

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తప్ప అధికారికంగా ఏ ఇంచార్జ్ కూడా చంద్రబాబు సీటు ఫిక్స్ చేయలేదని, ఎవరు కూడా సీటు వచ్చిందని ప్రకటించుకోవడం కరెక్ట్ కాదని ఇటీవలే టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అంటే అధికారికంగా ఎవరికి సీటు ఫిక్స్ కాలేదు. కాకపోతే చంద్రబాబు..నియోజకవర్గ ఇంచార్జ్‌లతో సమావేమవుతూ..ఈ సారి గెలిచి తీరాలని కొందరికి చెబుతున్నారు. దీంతో వారికి సీటు ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ అధికారికంగా ప్రకటన ఇవ్వట్లేదు. ఇలా ముందుగానే […]