వైకాపా అధినేత జగన్‌కు పొలిటికల్ రైవల్ కడప టీడీపీ యువ నేత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. ఎట్టకేలకు తన గడ్డం దీక్షకు మోక్షం లభించడంతో ఆనందంతో ఊగిపోతున్నారు. తన దీక్ష ఫలించినందుకు పార్టీ చేసుకుంటున్నారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, మొత్తంగా టీడీపీ విజయంగా ఆయన పేర్కొంటున్నారు. అదేసమయంలో వైఎస్ కు కంచుకోట వంటి పలివెందులలోనూ టీడీపీసైకిల్ రివ్వున సాగాలని, ఆదిశగా తాను మరిన్ని చర్యలు తీసుకుంటానని సతీష్ చెబుతున్నారు. ఈ […]
Tag: TDP
వంశీ నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం…బాబుకు కంప్లైంట్
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి కృష్ణాజిల్లా టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు ప్రధాన నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవల తిరగి టీడీపీ సైకిలెక్కిన దేవినేని నెహ్రూ, ఇప్పటికే టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీల మధ్య ఇప్పుడు వివాదాల వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు వీరి మధ్య ఘర్షణలకు తావిచ్చేలానే ఉండడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ కి చెందిన సీనియర్ రాజకీయ నేత, కాంగ్రెస్ మాజీ నేత, […]
కడప గడపలో జగన్ పట్టు సడలుతోందిగా..
కడప జిల్లా అంటే వైసీపీకి పెట్టని కోట.. నిజానికి గత ఎన్నికలకు ముందు అక్కడ టీడీపీ సమర్థులకోసం కాగడా పెట్టి వెదికి మరీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అయినా అసెంబ్లీ ఫలితాలు మాత్రం జిల్లా వరకు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అలాంటిది మరి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో ప్రస్తుతం జగన్ వెంట నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో […]
టీడీపీలో కూడా వెంకయ్యకు పదవి ఉందా
ఏంటి టైటిల్ చూసి డంగయ్యారా? కేంద్రం మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎప్పుడు కమలాన్ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుని, పసుపు కండువా కప్పుకుని సైకిలెక్కారా? అని శూన్యంలోకి చూపులు సారించి మెదడుకు పని చెప్పారా? ఆన్సర్ దొరకలేదా? అయితే.. ఇది చదవండి.. రిజల్ట్ ఉంటుంది! స్టేట్ విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే ప్రచారం సాగడం, ఎన్నికల హామీ నేపథ్యంలో అందరూ హోదాపై తెగ మనసు పెట్టుకున్నారు. ఇదే విషయంలో చంద్రబాబు […]
టీడీపీ కంచుకోటలో అసంతృప్తి సెగలు
ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తిస్థాయిలో సహకారం అందించిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం గత ఎన్‌టీఆర్ కాలం నుంచి ఈ పార్టీకి కంచుకోటగా ఉంది. ముఖ్యంగా ఎన్‌టీఆర్ సహా ఆయన తనయుడు బాలయ్యలు ఈ జిల్లా నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒక్క ఉరవకొండ, కదిరి నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సైకిల్ దూసుకుపోయింది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్లనూ టీడీపీనే కైవసం చేసుకుంది. దీంతో స్టేట్‌లో టీడీపీకి అత్యధిక బలం […]
మాజీ మంత్రిపై దయ వెనక మర్మమేమిటో
నేటి రాజకీయాల్లో అధికార పార్టీలు విపక్షంలో ఉన్నవారితో ఒకాటాడుకుంటున్నాయి… చేతిలో ఉన్న పవర్‌ను వినియోగించుకుని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడటం ద్వారా వారిని లొంగదీసుకునేందుకు అన్నివిధాలుగానూ ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీకి, ఏనాయకుడికి మినహాయింపు లేదనే చెప్పాలి. సాధారణంగా తమిళనాట ఈ సంస్కృతి ఎక్కువగా కనిపించేది. అయితే వైఎస్ హయాంలో రాష్ట్రంలోనూ ఈ ధోరణి పతాక స్థాయినందుకుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమూ దానినే అనుసరిస్తోంది. అయితే మేం అలాంటి విధానాలకు వ్యతిరేకమని వారు చెప్పుకోవడమే […]
సొంత పత్రిక పెట్టనున్న టీడీపీ
ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నప్పటికీ.. దినపత్రికలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అసలు ఓ పేదేళ్ల కిందట ఎలక్ట్రానిక్ మీడియా అడుగులు వేస్తున్న క్రమంలో ఇంక దినపత్రిక పని అయిపోయింది! అనే టాక్ వచ్చింది. అయితే, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా బలంగా దినపత్రికలే నేటికీ తమ ఉనికిని చాటుతున్నాయి. మీడియాపై ఒకింత తేలిగ్గా విమర్శలు చేసే వాళ్లు కూడా పత్రికల విషయానికి వచ్చేసరికి ఆచితూచి మాట్లాడతారు. ప్రజలు కూడా ఎక్కువగా పేపర్లనే నమ్ముతారు. అందుకే ఎలక్ట్రానిక్ […]
ఏపీ మునిసిపల్ ఎన్నికల పై TJ విశ్లేషణ
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల, రాజాం, రాజంపేట, కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగులేదని, మరింత బలం పెంచుకున్నామని చాటుకోవాలని.. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.. అదే సమయంలో ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవడం ద్వారా అధికార పార్టీకి కళ్లెం వేయాలని, 2019 […]
చంద్రబాబు తో క్లాస్ పీకించుకున్న మంత్రి
ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి కాస్త పక్కనబెట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేపనిలో బిజీగా మునిగిపోయారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై అవగాహన ర్యాలీలు, దోమలపై యుద్ధం కార్యక్రమాలు కూడా పార్టీ తరపున ప్రభుత్వం తరపున గట్టిగానే చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్ధేశ్యం మంచిదే అయినా ఈ కార్యక్రమం అమలు చేయాల్సిన అధికారుల్లో ఆ స్థాయి స్పందన కనిపించడంలేదు.. అయితే ప్రజా ప్రతినిధులు.. ప్రచార కండూతితో, హడావుడి మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు. నిజానికి ఎడతెరిపిలేని వర్షాలతో […]