రెండేళ్లలో తమ అధినేత సీఎం పగ్గాలు అందుకుంటాడని కలలు కంటున్న వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైంది. టీడీపీ పని అయిపోయిందని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజన్య రాజ్యం వస్తుందని కలలు కంటున్న కార్యకర్తల్లో కలవరం మొదలైంది. వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ నేత జైలుకు వెళితే.. ఏంటనే ప్రశ్నలు, సందేహాలు అందరి మెదడును తొలిచేస్తున్నాయి. తర్వాత తమ భవిష్యత్తు ఏంటని ఇప్పటినుంచే […]
Tag: TDP
కేబినెట్ నుంచి బాబు విశ్వసనీయుడు అవుట్..!
ఏపీ కేబినెట్ ప్రక్షాళన న్యూస్ ఇప్పుడు పెద్ద ఫీవర్‌లా మారింది. ఈ విస్తరణలో కేబినెట్ నుంచి సీఎం చంద్రబాబుకు గత కొన్ని యేళ్లుగా అత్యంత విశ్వాసపాత్రుడిగా, పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న మంత్రికి ఊస్టింగ్ తప్పేలా లేదు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి చాలా యేళ్లుగా ప్రాథినిత్యం వహస్తున్నారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, సంక్షోభంలోను చంద్రబాబు వెన్నంటే ఉన్న బొజ్జలకు గత ఎన్నికల్లో పార్టీ విజయం తర్వాత అటవీ శాఖా మంత్రి […]
లోకేశ్‌కు ఆ రెండు శాఖలు కన్‌ఫార్మేనా..!
ఏపీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది ఆశావాహులు, ఉద్వాసన లిస్టులో ఉన్న వారికి టెన్షన్ పెరిగిపోతోంది. ప్రస్తుతం మంత్రివర్గం 20 మంది ఉండగా,ఆ సంఖ్యను 26 వరకూ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న వారి నుంచి ఐదుగురు అవుట్ అవుతారన్న సంకేతాలు కూడా ఇప్పటికే ఆయా మంత్రులకు చేరినట్టు తెలుస్తోంది. అవుట్ అయ్యే వారు ఐదుగురు, కొత్తగా […]
పట్టిసీమలో ఫ్రాడ్ గుట్టు రట్టు చేసిన కాగ్
పట్టిసీమ ప్రాజెక్టుతో చంద్రబాబు చెప్పిన గొప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క ప్రాజెక్టుతో దేశంలోనే నదుల అనుసంధాన్ని తొలిసారిగా పూర్తిచేసిన ఘతన తనదే అని ఆయన ఓ రేంజ్‌లో భజన చేసుకున్నాడు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు కోసం తవ్విన కాల్వలను వాడుకుని ఎత్తిపోతల పథకంతో గోదావరి నీళ్లను ప్రకాశం బ్యారేజ్‌కు తరలించిన చంద్రబాబు సర్కార్ కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం అంటూ చేసుకున్న చెక్కభజన అంతా ఇంతా కాదు. అయితే ఈ ప్రాజెక్టులో చాలా […]
ఊస్టింగ్ మంత్రులతో బాబుకు బెదిరింపులా..!
గత యేడాదిన్నరగా చర్చల్లో ఉన్న ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9.25 గంటలకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. మంత్రివర్గంలో ఇన్-అవుట్ అంటూ వస్తోన్న వార్తలతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గం నుంచి తమను తప్పిస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కొందరు మంత్రులు తమను తప్పిస్తే పార్టీకి గుడ్ బై చెపుతామని తమ అనుచరుల […]
సోమిరెడ్డి మంత్రి పదవికి బ్రేక్ వేస్తోందెవరు..!
మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు రావడంతో నెల్లూరు జిల్లాలో మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ఎప్పటి నుంచో వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. మంత్రి అయ్యేందుకు సోమిరెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు బీసీ కోటాలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చర్చలు ముమ్మరంగా సాగుతుండడంతో సోమిరెడ్డి నిన్నటి […]
టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌కే ట్రబుల్స్
వెండి తెర అద్భతం బాహుబలి సినిమాకు, తెలంగాణ రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇలా అనిపించక మానదు మరి! టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావు క్రమక్రమంగా ప్రాధాన్యం కోల్పోతున్నారు. అంతేగాక కష్టకాలంలో పార్టీని తన భుజస్కందాలపై మోసిన ఆయన్ను.. మేనమామ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ స్పష్టంగా […]
లోకేశ్ తెలుగు చూసి అవాక్కైన తమ్మళ్లు
ఎట్టకేలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారితో కలిపి లోకేశ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లోకేశ్‌తో పాటు మరో పది మంది ఎమ్మెల్సీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన లోకేష్ ప్రసంగాన్ని చూసిన టీడీపీ నేతలకు నవ్వు ఆగలేదు. పక్కనున్న వారు అయితే షాక్ అయిపోయారు. లోకేష్ ఎమ్మెల్సీగా ఫస్ట్ రోజే ఫెయిల్ […]
అగ్రిగోల్డ్ మ్యాటర్‌లో పవన్ కన్‌ఫ్యూజ్
ఏపీలో ప్రస్తుతం రాజకీయం అంతా అగ్రిగోల్డ్ వ్యవహారం చుట్టూనే తిరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఈ వ్యవహారంపైనే కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలపై వార్ జరుగుతోంది. అగ్రిగోల్డ్ మ్యాటర్లో విపక్ష వైసీపీ అధికార టీడీపీపై ముప్పేట దాడి చేసింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అగ్రిగోల్డ్ భూములను కొన్నారని వైసీపీ అధినేత జగనే స్వయంగా ఆరోపణలు చేశారు. తర్వాత ఇదే అంశంపై జగన్ సవాల్, ప్రత్తిపాటి ప్రతిసవాల్, చంద్రబాబు జగన్‌కు ఓపెన్ ఛాలెజింగ్ చేసే వరకు మ్యాటర్ […]