వాకాటి గురించి వైసీపీ ముందే చెప్పిందా?!

అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీ నుంచి స‌స్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డిపై జ‌గ‌న్ పార్టీ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయింది. వాకాటిని టీడీపీలోకి చే్ర్చుకునే ముందే తాము హెచ్చ‌రించామ‌ని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్‌ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రజల దృష్టిని మార్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్‌ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్‌, రాయపాటి సాంబశిరావులపై […]

మంత్రి ప‌ద‌వి పాయే…. ఎమ్మెల్యే టిక్కెట్టు క‌ష్ట‌మే..!

ఎన్నో ఆశ‌లతో, మంత్రి హామీతో వైసీపీ నుంచి సైకిలెక్కిన ఎమ్మెల్యే ప‌రిస్థితి రెండిటికీ చెడ్డ రేవ‌డిలా మారిపోయింద‌ట‌. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న పేరు ప‌రిగ‌న‌ణ‌లోకి కూడా తీసుకోక‌పోవ‌డంతో ఇప్ప‌టికే ఆయ‌న అసంతృప్తిలో ఉన్నార‌ట‌. పార్టీలో చేరే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చినా చివ‌రి నిమిషంలో ప‌ట్టించుకోలేద‌ట‌. ఇప్పుడు దీనికి తోడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు కూడా ద‌క్కే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఏం చేయాలో […]

ఆ ఇద్ద‌రి భేటీతో మిత్ర‌ బంధానికి బ్రేక్ ప‌డిందా? 

ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మిత్రులు శ‌త్రువులు అవుతున్నారు. శ‌త్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వత శ‌త్రువులు ఉండ‌ర‌నే దానికి స‌రైన నిర్వ‌చనంలా మారుతున్నాయి. కొత్త పొత్తుల‌కు రంగం సిద్ధ‌మవుతోంది. టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగింది. ప్ర‌ధాని మోదీతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ భేటీ అనంత‌రం.. టీడీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. ప్ర‌స్తుతం అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు.. మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు ప‌లికేలా […]

బాబుపై రాయ‌పాటి వ్యాఖ్య‌ల వెనుక రీజ‌న్ ఇదే

విశాఖ రైల్వే జోన్ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఎంపీలంతా ఒక స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే దీని నుంచి అర్ధంత‌రంగా బ‌య‌టికొచ్చిన ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఎన్నిసార్లు భేటీ అవుతున్నా జోన్ ఎందుకు రావ‌డం లేదని ఘాటుగానే ప్ర‌శ్నించారు. అయితే చంద్ర‌బాబుపై ఇంత‌లా ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం వెనుక కారణం కూడా లేక‌పోలేద‌ట‌. […]

లోకేష్ `ఐటీ`లో పాస‌య్యే బాధ్యత చంద్ర‌బాబుదే

ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు చంద్ర‌బాబు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌.. ఐటీ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం.. పెద్ద ఎత్తున కంపెనీలు, ఉద్యోగాలు తీసుకొస్తాన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. సంక్షోభాల నుంచి అవ‌కాశాలు సృష్టించుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలో శ‌ర‌వేగంగా ఐటీ కంపెనీల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మరి ఈ […]

మోడీ జగన్ భేటీ గురించి ప్రశ్నించడానికి మీరెవరు?

ప్రధాని మోడీ మరియు వైస్ జగన్ భేటీ తో నవ్యంద్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కినాయి .మోడీ  భేటీలో ప్రత్యేక హోదా ,రైతుల గిట్టుబాటు ధర,భూసేకరణ ,చంద్రబాబు అవినీతి మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన మాట్లాడానని  వైస్ జగన్ చెప్పుతుంటే, టీడీపీ మంత్రులు మరియు నాయకులు లేదు వైస్ జగన్ పైన ఉన్న కేసులు ,మని లాండరింగ్ ఛార్జ్ షీట్లు కేసు లో కూడా జగన్ ని A1 ముద్దయి గా ED చేర్చితే తనను ఎక్కడ […]

వైసీపీకి మరో ఎదురు దెబ్బ

ఏపీలో అధికార టీడీపీని ఢీకొట్ట‌డంలో దారుణంగా ఫెయిల్ అవుతోన్న విప‌క్ష వైసీపీకి మ‌రో షాక్ తగిలింది.  ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు ఏకంగా వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీ బ‌లంగా ఉన్న మ‌రో కీల‌క జిల్లాలో ఓ కీల‌క నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ […]

నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ కానీ ప్రజల మాట మరోలా..!

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ధూళిపాళ్ల ఫ్యామిలీకి బ‌ల‌మైన అనుబంధం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద్ర గెలుస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తండ్రి వీర‌య్య చౌద‌రి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌నిచేశారు. 1994 నుంచి అక్క‌డ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న న‌రేంద్ర పొన్నూరును త‌న అడ్డాగా చేసుకున్నారు. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 18 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా న‌రేంద్ర గెలిచాడంటే న‌రేంద్ర స్టామినా అర్థ‌మ‌వుతోంది. ఐదుసార్లు […]

లోకేష్ ముందు వాళ్ళ ఆటలు సాగవా?

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు పార్టీలో త‌న ప‌ట్టు పెంచుకునేందుకు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సీనియ‌ర్ మంత్రులు ఉన్నా.. వారి వ్య‌వ‌హారాలు కూడా ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు త‌నతోపాటు మంత్రి వ‌ర్గంలో చేరిన వారి వంతు వచ్చింది. కేవ‌లం వారిది మంత్రి వ‌ర్గంలో నామ‌మాత్ర‌పు పాత్రేన‌ని తేలిపోయింది. మంత్రులే అయినా వారి పీఏ, పీఆర్వోల‌ను కూడా నియ‌మించుకోలేని ప‌రిస్థితి. త‌మ సిబ్బందిని కూడా లోకేష్ […]