ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు మాంచి జోష్‌లో ఉంది. నిద్రాణంగా ఉన్న టీడీపీ వాళ్లను, టీడీపీ అభిమానులను జగన్ రెచ్చగొట్టి మరీ నంద్యాల ఉప ఎన్నికతో ఫామ్‌లోకి తీసుకువచ్చాడు. నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు టీడీపీ సైనికులు, కార్యకర్తలు, నాయకుల్లో ఓ విధమైన నిస్తేజం నెలకొంది. ఎప్పుడైతే జగన్ నంద్యాల ఉప ఎన్నికల్లో సంప్రదాయానికి విరుద్ధంగా తమ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టడంతో పాటు టీడీపీ నుంచి వచ్చిన శిల్పా మోహన్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం, […]
Tag: TDP
టీడీపీలోకి జంప్ చేసే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో చూశాం. ఈ ఎన్నిక దాదాపు నెల రోజులు పాటు తెలుగు రాజకీయాలను బాగా హీటెక్కించేసింది. ఈ ఎన్నిక కోసం ఏపీ సీఎం చంద్రబాబు తన సచివాలయంలో ఉండాల్సిన మంత్రులతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలందరిని అక్కడే మోహరించేశారు. తాను సైతం చివరి రెండు రోజులు నంద్యాలలో ప్రచారం చేశారు. ఇక విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ అయితే తన పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ మోహరించడంతో పాటు తాను ఏకంగా […]
ఏపీ రాజకీయాలు ఇలానే ఉంటే ఎవరికి లాభం..?
రాష్ట్ర రాజకీయాలు ఏకపక్షం అవుతున్నాయా? రాష్ట్రంలో టీడీపీ కేంద్రంగా రాజకీయం మారిపోతోందా? విపక్షాలను ప్రజలు పట్టించుకోవడంలేదా? దేశంలో అతి పెద్ద, అతి సీనియర్ జాతీయ రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోతోందా? ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్ కుకంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీ నిలువనీడ కోల్పోయి అలో లక్ష్మణా అంటోందా? ఏపీ ప్రధాన విపక్షంగా ఉన్న జగన్ పరిస్థితి దారుణంగా తయారైందా? అంటే.. తాజా రెండు ఎన్నికల ఫలితాలు ఔననే సమాధాన మిస్తున్నాయి. […]
కాకినాడ కార్పొరేషన్ ఫైనల్ రిజల్ట్ ఇదే
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఘనవిజయం సాధించింది. నిన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ఘనవిజయాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా గెలవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 11.30 నిమిషాలకు ముగిసింది. మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. 48 డివిజన్లలోను టీడీపీ 32 డివిజన్లు, మిత్రపక్షమైన బీజేపీ 3, వైసీపీ 10, టీడీపీ రెబల్ అభ్యర్థులు 3 […]
కాకినాడలో టీడీపీకి రెండు మైండ్ బ్లాక్ షాక్‌లు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీడీపీ ఏకపక్ష విజయం సాధించింది. నంద్యాలలో ఘనవిజయాన్ని కంటిన్యూ చేస్తూ కాకినాడలో కూడా సైకిల్ బ్రేకుల్లేకుండా దూసుకుపోయింది. వార్ వన్‌సైడ్ చేసేసి విజయం సాధించింది. ఇక్కడ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా ఇచ్చిన 9 సీట్లలో సరిగా పెర్పామ్ చేయలేకపోయింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్యే స్వయంగా వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇక ఇక్కడ టీడీపీ ఏకపక్ష విజయం సాధించినా ఆ పార్టీకి రెండు మైండ్ బ్లాక్ […]
కాకినాడలో టీడీపీకి షాక్
నంద్యాల ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మాంచి జోష్‌లో ఉన్న టీడీపీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోను అదే జోరును కంటిన్యూ చేస్తూ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో టీడీపీ+బీజేపీ కూటమి మెజార్టీ డివిజన్లు కైవసం చేసుకుని కార్పొరేషన్ గెలుచుకుంది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా వార్ […]
నంద్యాలలో టీడీపీ గెలుపుపై మోడీ ట్వీట్‌లో మెలిక ఏంటి
నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించింది. భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యమైన ఈ ఉప పోరుకు సంబంధించి జాతీయ మీడియా సైతం భారీ ఎత్తున ప్రచారం చేసింది. ముఖ్యంగా చంద్రబాబుపై జగన్ చేసిన వివాదాస్పద కామెంట్లు నేషనల్ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దేశానికి రాష్ట్రపతి, ప్రధానులుగా చేసిన వారిని ఎన్నుకున్న ఈ నంద్యాల ప్రజలపై అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ ఉప ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఇక్కడి […]
బీజేపీతో ఆట… ఇప్పుడు బాబు టైం వచ్చిందా
2014లో జట్టు కట్టి.. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలతో జై కొట్టించుకున్న టీడీపీ-బీజేపీల బంధం మరింత గట్టి పడుతుందని, బాబు మరింత సన్నిహితమవుతారని, బీజేపీ అండకోసం బాబు మరిన్ని అడుగులు ముందుకు వేస్తారని నిన్న మొన్నటి వరకు వచ్చిన వార్తలు… తాజా నంద్యాల ఉప ఎన్నికతో తారుమారయ్యాయి. నంద్యాల ఉప పోరు ప్రతిష్టాత్మకంగా మారడం, జగన్‌తో ఢీ అంటే ఢీ అనేలా పోరు నడవడం, 2014లో తనతో కలిసి వచ్చిన పవన్ తటస్థ వైఖరి అవలంబించడంతో బాబు […]
టీడీపీలోకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. లిస్ట్ ఇదే..?
నంద్యాల ఫలితం వైసీపీకి 2019లో అధికారం దక్కుతుందా ? అన్న ప్రశ్నకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం కష్టమే అన్న ఆన్సర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు కూడా ఇదే విషయమై ఆందోళనతో చర్చించుకుంటున్నారు. జగన్‌కు బలమైన రాయలసీమలోనే ఈ పరిస్థితి ఎదురవ్వడంతో సీమలో వైసీపీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ మూడేళ్లలో జగన్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేశారు. 21 మంది ఎమ్మెల్యేలు నంద్యాల, అరకు ఎంపీ […]