కొత్త డేట్‌కు షిఫ్ట్ అయిన ప్ర‌భాస్ `స‌లార్‌`..పండక్కే విడుద‌ల‌ట‌?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14 న తేదిన విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, అదే తేదీని ప్ర‌శాంత్ నీల్, […]

గుండులో ద‌ర్శ‌న‌మిచ్చిన ఫహద్‌..`పుష్ప‌` విల‌న్ లుక్ చూశారా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్ పాత్ర‌లో అర‌లించ‌నున్నాడు. అయితే తాజాగా ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ […]

షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ప్రియాంక చోప్రా..వైర‌ల్‌గా పిక్స్‌!

గ్లోబల్‌ స్టార్‌, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా త‌ల‌కు తీవ్రంగా గాయ‌మైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్‌ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]

భార‌త్‌లో మ‌ళ్లీ భారీగా న‌మోద‌వుతున్న క‌రోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే గ‌త నాలుగు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 46,759 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!!

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించారు. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి అడ్డుప‌డింది. ఓటీటీలోనే చిత్రం విడుద‌ల అవుతుంద‌ని జోరుగా […]

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ శ్రీ‌కాంత్ కూతురు..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. హీరోహీరోయిన్లే కాకుండా ద‌ర్శ‌క‌నిర్మాత‌లెంద‌రో తమ వారసులను చిత్ర సీమకు పరిచయం చేశారు. ఇప్ప‌టికీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌రో వార‌సురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆమె ఎవ‌రో కాదు సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ కూతురు మేధ. శ్రీ‌కాంత్‌-ఊహ దంప‌తాలు కుమారుడు రోష‌న్ ఇప్ప‌టికే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌గా… ఇపుడు 17 ఏళ్ల కూతురు మేధ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంద‌ట‌. […]

నో షూటింగ్‌..ఇట్స్ డ్యాన్సింగ్‌ టైమ్ అంటున్న ప్ర‌భాస్!?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒక‌టి. రామాయణం నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీతగా కృతీ సనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ జ‌రుగుతోంది. ప్ర‌భాస్ కూడా ముంబైలోనే ఉన్నారు. కానీ, […]

ఏంజెల్‌లా మెరిసిపోతున్న వకీల్ సాబ్ బ్యూటీ..వైర‌ల్‌గా న్యూ పిక్స్‌!

`మల్లేశం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అనన్య నాగల్ల.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `వకీల్‌ సాబ్` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈమె న‌టించిన ప్లే బ్యాక్ చిత్రం కూడా ప్రేక్ష‌కుల‌ను అద్భుతంగా ఆక‌ట్టుకోగా.. అన‌న్య‌కు సూప‌ర్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సినిమాల్లో ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించే అన‌న్య‌.. బ‌య‌ట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు లేలేత నడుము అందాలు, నాభి సోకులతో కైపెక్కిస్తూ త‌న […]

వామ్మో..అరియానా ఏంటి ఇలా మారిపోయింది..చూస్తే తట్టుకోలేరేమో!!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ రామ్ గోపాల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి.. త‌న‌దైన ఆట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ఈ షో త‌ర్వాత అరియానా టీవీ షోలే కాకుండా ప‌లు సినిమాల్లోనూ ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటోంది. అలాగే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే […]