టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో అరలించనున్నాడు.
అయితే తాజాగా ‘విలన్ఆఫ్పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్ లుక్ను మేకర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే భయంకరమైన పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. పూర్తి గుండులో దర్శనమిచ్చి ఫాహద్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
మొత్తానికి ఆకట్టుకుంటున్న ఫహద్ ఫస్ట్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కాగా, షూటింగ్ దశలో ఉన్న పుష్ప మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.