ల‌గ‌డ‌పాటి జోస్యం నిజ‌మైంది.. కాకినాడ కూడా సైకిల్‌దేన‌ట‌! 

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా గుర్తింపు పొందిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌.. నంద్యాల ఉప పోరుపై చెప్పిన జోస్యం అక్ష‌రాలా నిజ‌మైంది. అత్యంత ట‌ఫ్‌గా సాగిన ఈ ఉప ఎన్నిక‌పై అందరూ ఏవేవో.. క‌థ‌నాలు , జోస్యాలు చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి కూడా త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. ఇక్క‌డ ఎంత ట‌ఫ్ పోరు సాగినా..భారీ సంఖ్య‌లో జ‌నాలు క్యూక‌ట్టి ఓట్లేసినా.. కూడా వార్ వ‌న్ సైడ్ అయిపోతుంద‌ని, టీడీపీ గెలిచి తీరుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. […]

ల‌గ‌డ‌పాటి స్కెచ్ టీడీపీ ఎంపీకా..వైసీపీ ఎమ్మెల్యేకా..!

ద‌శాబ్దం పాటు ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ గ‌త ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డంతో రాజ‌కీయాల‌పై విర‌క్తితో ఆయ‌న వాటికి దూర‌మ‌య్యారు. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇటు స్టేట్ పాలిటిక్స్‌లో కింగ్‌. అటు జాతీయ‌స్థాయిలోను స‌త్తా చాటారు. మీడియాలో ఎక్క‌డ చూసినా ల‌గ‌డ‌పాటి హంగామా చాలా ఎక్కువ‌గానే ఉండేది. అలాంటి ల‌గ‌డ‌పాటి వాయిస్ ఇప్పుడు చాలా త‌క్కువుగా మాత్ర‌మే వినిపిస్తోంది. […]

2019 బెజ‌వాడ టీడీపీ ఎంపీ సీటు మూడు ముక్క‌లాటేనా..!

ఏపీలో రాజ‌కీయ చైత‌న్యానికి పురిటిగ‌డ్డ కృష్ణా జిల్లా. ఇక బెజ‌వాడ రాజ‌కీయం తెలుగు రాష్ట్రాల్లోనే ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీ అయ్యేందుకు వివిధ పార్టీల త‌ర‌పున ఎంపీ సీటు ద‌క్కించుకునేందుకు అక్క‌డ నాయ‌కులు చేయ‌ని ప్ర‌య‌త్నాలు అంటూ ఉండ‌వు. ఏపీలో విజ‌య‌వాడ ఎంపీ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక్క‌డ నుంచి ఎంతోమంది మ‌హామ‌హులు, పారిశ్రామిక‌వేత్త‌లు లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ల‌గ‌డ‌పాటి ఆ త‌ర్వాత […]

చంద్ర‌బాబు కంగారు వెన‌క అస‌లు రీజ‌న్ ఇదేనా..!

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రెండేళ్లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో ఆయ‌న ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళిపోయార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు 2019 ఎన్నిక‌ల‌కు సన్నాహ‌కాల‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. పార్టీకి అన‌వ‌స‌ర‌మ‌ని భావించిన‌వారిపై వేటు వేయ‌డం.. పార్టీకి అవ‌స‌ర‌మైన వాళ్లు విపక్షం నుంచి వ‌చ్చినా వారిని అంద‌ల‌మెక్కించ‌డం వంటి ప‌క్కా వ్యూహంతో బాబు వ్యూహాలు ర‌చిస్తున్నారి విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని గట్టిగా చెప్పే చంద్ర‌బాబు.. […]

ల‌గ‌డ‌పాటి ఇంట్లో పెళ్లి బాజాలు

కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. ప్ర‌స్తుతం త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. స‌మైక్య వాదాన్ని పార్ల‌మెంటులో వినిపించిన ఆయ‌న‌.. రాష్ట్రం రెండు ముక్క‌లైతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించి.. దానికి క‌ట్టుబ‌డి ఉన్న విష‌యం తెలిసిందే! అయితే ప్ర‌స్తుతం ల‌గ‌డ‌పాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగే స‌మ‌యం వ‌చ్చింది. ఆయ‌న ఇద్ద‌రు కుమారుల‌కు ఒకేసారి ఎంగేజ్‌మెంట్ వేడుక ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు హైదరాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ వేదిక కాబోతోంది. […]

ల‌గ‌డ‌పాటి టీడీపీ ఎంట్రీ..!

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ … ఉమ్మ‌డి  తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో రెండు మూడేళ్ల క్రితం దాకా ఆ పేరే ఓ సంచ‌ల‌నం. త‌న చొర‌వ‌, దూకుడు క‌ల‌గ‌లిసిన  స్వ‌భావంతో ఆయ‌న పారిశ్రామికంగా అతి త‌క్కువ కాలంలోనే అగ్ర‌శ్రేణి పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగిన వ్య‌క్తి. ఇక  రాజ‌కీయరంగంలోనూ ఆయ‌న ప‌దేళ్ల ప్ర‌స్థానం అడుగ‌డుగునా సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌నను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ ఓ ర‌కంగా రాజ‌గోపాల్‌ ఒంట‌రి పోరాట‌మే కొన‌సాగించారు. ఓ ప‌క్క విభ‌జ‌న వాదుల‌తోను, మ‌రో ప‌క్క తన సొంత […]